ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Megastar Chiranjeevi Bholaa Shankar Shoot Begins In A Huge Set

భారీ సెట్‌లో మొదలైన మెగాస్టార్ భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్.. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ రోజు నుండి అంటే సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఏస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి మీద ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

భోళా శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్‌లో చూపించబోతోన్నారు.

అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. కీర్తి సురేష్ ఆయన చెల్లిగా కనిపించనున్నారు. పక్కా కమర్షియల్‌గా ఈ చిత్రం ఉండబోతోంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో

ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

భోళా శంకర్ వచ్చే ఏడాది థియేటర్స్ లో విడుదల కానుంది.

Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara Mega Massive Movie Bholaa Shankar Shoot Begins In A Huge Set

Megastar Chiranjeevi Bholaa Shankar Shoot Begins In A Huge Set
megastar chiranjeevi
meher ramesh
anil sunkara
mega massive movie
bholaa shankar movie
bholaa shankar shoot begins in a huge set