బాలయ్యకి విలన్స్ గా తండ్రీకొడుకులు

బాలకృష్ణ లెజెండ్ మూవీ తో విలన్ గా చేసిన హీరో జగపతి బాబు కి లెజెండ్ మూవీ విలన్ కేరెక్టర్ మంచి కెరీర్ నే ఇచ్చింది. ఇప్పుడు మరో హీరో కూడా బాలయ్య కి విలన్ గా నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. అతనెవరో కాదు.. ఈమధ్యన మా ఎలక్షన్స్ లో పోటీ పడి.. అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు.. బాలకృష్ణ తనకి విలన్ ఆఫర్ ఇస్తే తాను హీరో గా చేసే సినిమాని ఆపేసి మరీ వచ్చి నటిస్తాను అంటే.. మోహన్ బాబు నీ సినిమాల్లో విలన్ గా నటించాలని ఉంది  అని చెప్పారు. ఇంతకీ ఈ డిస్కర్షన్ అంతా.. బాలకృష్ణ ఆహా ఓటిటి కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో జరిగింది.

బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటి వారు అంటే అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ టాక్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కి మంచు ఫ్యామిలీ గెస్ట్ లు. అందులో మోహన్ బాబు ని రకరకాల ప్రశ్నలతో బాలయ్య తిప్పలు పెట్టాడు. సోదరా అంటూనే మోహన్ బాబు చక్కగా సమాధానాలు ఇవ్వగా మధ్యలో ఈ షోలో జాయిన్ అయిన మంచు విష్ణు, లక్షలు సందడి చేసారు. అందులో భాగంగానే అన్న మీ సినిమాల్లో విలన్ ఆఫర్ వస్తే చేస్తాను అంటే.. మోహన్ బాబు కూడా మీ సినిమాలో విలన్ గా చెయ్యాలని ఉంది అన్నారు. మరి బాలయ్య నిజంగానే ఆఫర్ ఇస్తే.. మంచు విష్ణు పర్ఫెక్ట్ విలన్ గా బాలయ్యని ఢీ కొడతాడు అంటూ బాలయ్య ఫాన్స్ భజన మొదలు పెట్టాశారు. 

Unstoppable With NBK and Mohan Babu

Father and son as villains to Balayya
balakrishna
mohan babu
manchu vishnu
aha ott
unstoppable with nbk and mohan babu
unstoppable talk show