బిగ్ బాస్ 5: ఇదేం ట్విస్ట్ నాగ్

నాగార్జున ఈ శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు.. బుల్లితెర ప్రేక్షకులకి భారీ ట్విస్ట్ కాదు.. భారీ షాక్ ఇచ్చాడు. ఈ రోజు శనివారం ఎపిసోడ్ లో తప్పు చేసిన వారికి వరసగా క్లాస్ పీకుతూనే.. ఎవరో ఒకరిని సేవ్ చెయ్యాల్సిన నాగ్.. ఒక్కొక్కరిని పవర్ రూమ్ లోకి పిలిచి.. నీ మధ్య నా మధ్యన జరిగేది పర్సనల్ అంటూ. ఈ హౌస్ లో అర్హత లేకుండా ఎవరు ఉన్నారు.. ఎవరు బయటికి వెళితే బావుంటుంది అంటూ.. నాగార్జున అడగగా.. శ్రీరామ్ త్వరగా చెప్పలేకపోయాడు.. కానీ నాగార్జున మాత్రం నెంబర్లు కౌంట్ చేస్తాడు. ఈ హౌస్ లో అర్హత లేని వారు ఎవరో చెప్పాలంటే కష్టం అన్నా.. నాగ్ వదల్లేదు.
ఇక కాజల్ అయితే నా దృష్టిలో రెండు పేర్లు అనగానే ఒక్కటే చెప్పాలి నాగ్ బాగా సీరియస్ అయ్యాడు. మరోపక్క మానస్ శ్రీరామ్ పేరు చెప్పగా.. కొంతమంది రవి పేరు చెప్పారు.. ఫైనల్ గా నలుగురు ప్రియా పేరు, నలుగురు లోబో పేర్లు చెప్పగా.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని హౌస్ నుండి బయటికి పంపండి అంటూ నాగ్ అల్టిమేటం జారీ చెయ్యగా.. ఆని మాస్టర్ కాస్త కన్ఫ్యూజ్ అయితే.. నాగ్ కాస్త గట్టిగానే చెప్పాడు.. ఫైనల్ గా ఈ హౌస్ నుండి ఒకరిని బయటికి పంపారు. మరి అసలు ఈ ట్విస్ట్ ఏమిటో.. అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తేలుతుంది. ఇది సీక్రెట్ టాస్కా.. లేదా నాగ్ నిజంగానే ఒకరిని బయటికి పంపేసాడా.. అనేది తెలియాల్సి ఉంది. అన్నట్టు ప్రియా ఈ వారం నామినేషన్స్ లో లేదు.. కానీ లోబో ఉన్నాడు. ఈ వారం లోబో ఎలిమినేట్ అవ్వొచ్చనే టాక్ కూడా ఉంది.
Bigg Boss 5 Telugu today latest promo Nagarjuna big twist
Bigg boss 5 telugu today big twist double elimination







































