పుష్ప పై అంచనాలు పెంచేసిన ఉప్పెన డైరెక్టర్

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు పార్ట్ గా రిలీజ్ కాబోతుంది అని అనగానే సినిమాపై పాన్ ఇండియా మార్కెట్ లో అంచనాలు పెరిగిపోయాయి. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే అందరికి విపరీతంగా ఎక్కేసింది. అయితే ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు ఈసినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాడు. అది గతంలో కన్నడ నుండి ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన కెజిఎఫ్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ కి ఫాన్స్ ఫిదా అయ్యారు. దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కి ఇప్పుడు స్టార్ ఛాన్సెస్ కేవలం కెజిఎఫ్ కారణంగానే వచ్చాయి. 

ఇప్పుడు అదే కెజిఎఫ్ పదింటిని కలిపితే ఒక్క పుష్ప పార్ట్ 1 అవుతుంది అంటూ బుచ్చి బాబు చెప్పడంతో ఈ సినిమాపై మరికొన్ని అంచనాలు పెరిగిపోయాయి. సుకుమార్ - అల్లు అర్జున్ మహా యజ్ఞంలా పూర్తి చేస్తున్న ఈ సినిమాలోని పార్ట్ 1 తాను చూసా అని.. అందులో అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్స్ కానీ,  సుకుమార్ గారి మాస్ ఎలివేషన్స్ కానీ ఒక పది కేజీయఫ్ లని కలిపితే పుష్ప పార్ట్ 1 అంటూ పుష్ప సినిమాపై తెగ హైప్ పెంచేసాడు. బుచ్చి బాబు మాటలతో బన్నీ ఫాన్స్ లో పుష్ప పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అందుకే అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు ఎక్కడా తగ్గేదే లే అంటూ అరిచి మరీ చెబుతున్నాడు అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

A startling revelation about Pushpa

Allu Arjun Pushpa bigger than KGF?
buchchi babu sana
uppena director buchibabu
stylish star allu arjun
puhspa movie
sukumar pushpa movie
kgf 2
kgf movie
pushpa pan india film