ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nandamuri Kalyan Ram Bimbisara title revealed

కామెడీ అయిన కళ్యాణ్ రామ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా చాలా బ్యాడ్ పొజిషన్ నుండి 118, ఎంత మంచివాడవురా సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అటు నిర్మాతగానూ, ఇటు హీరోగానూ బాగా ఎదురు దెబ్బలు తిన్న కళ్యాణ్ రామ్ తాజాగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. కొత్త దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న #NRK18 టైటిల్ పోస్టర్ ని నిన్న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసారు. బింబిసారా గా కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ నందమూరి ఫాన్స్ కి మంచి ఊపు ఇచ్చినా మిగతా ఫాన్స్ చేతిలో కళ్యాణ్ రామ్ బింబిసారా లుక్ తో అడ్డంగా బుక్ అయ్యాడు. అంటే కళ్యాణ్ బింబిసారా టైటిల్ పవర్ ఫుల్ గాను, ఫస్ట్ లుక్ పోస్టర్ కామెడీ అయ్యిందిగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతూన్నాయి. 

కళ్యాణ్ రామ్ బింబిసారా లుక్ ప్రభాస్ బాహుబలితో పాటుగా, రామ్ చరణ్ మగధీర లుక్స్ ని తలపించాయని.. అలాగే శత్రువులని చీల్చి చెండాడి ఆ శవాల గుట్టపై కూర్చున్న లుక్ చిరు ఖైదీ నెంబర్ 150 నుండి కొట్టేసింది అంటూ కళ్యాణ్ రామ్ బింబిసారా లుక్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. ప్రభాస్ బాహుబలిగా ఎప్పటికి గుర్తుండిపోయే హిట్ ఇచ్చాడు, మగధీరగా రామ్ చరణ్ లుక్ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనేలా ఉంది. అలాంటి తో లుక్స్ కళ్యాణ్ రామ్ ముచ్చట తీర్చుకున్నాడా? లేదంటే కథకి సంబందించిన లుక్ లో ఇలా ఉన్నాడా? అయినా కూడా బాహుబలిని, మగధీరని చూసి లుక్ లో చేంజెస్ చేస్తే బావుండేది. కానీ ఆ లుక్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి అదే లుక్స్ ని యాజిటీజ్ గా దించేస్తే ట్రోల్స్ రాక అభినందనలు వస్తాయా.. ఆంటూ మిగతా హీరోల ఫాన్స్ కామెడీ చేస్తున్నారు. గొప్పగా ఉంటుంది అని పాన్ ఇండియా లెవల్లో లుక్ ని వదిలినా కళ్యాణ్ రామ్ ఆలా కామెడీ అయ్యాడురా అంటున్నారు ఇతర ఫాన్స్. 

Nandamuri Kalyan Ram Bimbisara title Look

Nandamuri Kalyan Ram Bimbisara title revealed
nandamuri kalyan ram
bimbisara title look
kalyan ram bimbisara look
prabhas baahubali
ram charan magadheera
chiru khaidi nember 150