లైగర్ కోసం ముంబైలో భారీగా..

విజయ్ దేవరకొండ - పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై పరిసరప్రాంతాల్లో జరుగుతుంది. లాక్ డౌన్ తర్వాత విదేశీ ఫైటర్స్ రాక లేట్ అవడంతో లైగర్ షూటింగు లేట్ గా మొదలయ్యింది. గత ఫిబ్రవరిలో మొదలైన లైగర్ షూటింగ్ ని పూరి జగన్నాధ్ గ్యాప్ లేకుండా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఓ లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన పూరి కొత్త షెడ్యూల్ ఈ రోజు నుండి మొదలు పెడుతున్నాడు. లాక్ డౌన్ తర్వాత మొదలైన షెడ్యూల్ లో పూరి విదేశీ ఫైటర్స్ తో చెయ్యాల్సిన క్లయిమాక్స్ సన్నివేశాలను పూర్తి చేసేసాడు. ఆ కీలక మైన షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా.. ఇప్పుడు లైగర్ కోసం కొత్త షెడ్యూల్ మొదలు పెడుతున్నారు.
అయితే ఆ కొత్త షెడ్యూల్ లో లైగర్ కోసం భారీ సెట్స్ రెడీ చేశారట. కోట్లు ఖర్చు పెట్టి మరీ ఓ నాలుగు సెట్స్ నిర్మాణం చేపట్టారట. ప్రస్తుతం ఆ సెట్స్ లోనే విజయ్ - అనన్య పాండే, ఇంకా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగబోతుంది. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబో పై భారీ అంచనాలున్నాయి. అందులోనూ కరణ్ జోహార్ బ్యాక్ బోన్ గా తెరకెక్కుతున్న లైగర్ సినిమాకి పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది.
VIjay Deverakonda - Puri Liger Movie Latest Update
Liger Movie Latest Update







































