అభిజిత్ జైలుకి.. అఖిల్ ఫైనల్స్ కి!

బిగ్ బాస్ సీజన 4 మరో రెండు వారాల్లో ముగియ బోతుంది. నాగార్జున హోస్టింగ్ లో సక్సెస్ ఫుల్ గా ముగియబోతున్న బిగ్ బాస్ సీజన్ 4 లో లాస్ట్ వీక్స్ లో బిగ్ బాస్ హౌస్ ఏమోషన్స్, కంటెస్టెంట్స్ కొట్లాట ని హైలెట్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న అఖిల్, అవినాష్, అభిజీత్, మోనాల్, హరికలలో ఎవరు ఇంటి నుండి బయటికి వెళతారో తెలియదు కానీ.. టాప్ 5 లోకి మాత్రం టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి.. అఖిల్ ఫస్ట్ టాప్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ లోకి అడుగుపెట్టాడు. సోహైల్ - అఖిల్ హోరా హోరీగా ఆడినా.. సోహైల్ ఉయ్యాలా నుండి దిగిపోవడంతో అఖిల్ టాప్ 5 లోకి వెళ్లబోతున్నాడు. కానీ ఈ వారం ఎలిమినేట్ అవ్వకపోతేనే అఖిల్ టాప్ లోకి వెళ్లే ఫస్ట్ కంటెస్టెంట్ అవుతాడు.
ఇక ఉన్న ఏడుగురిలో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు 3rd, ఎవరు 4th , ఎవరు చివరి పొజిషన్ లో ఉంటారో తేల్చుకోమంటే సోహైల్ ఫస్ట్ పొజిషన్, అరియనా సెకండ్, మోనాల్ 3rd, హారిక 4th, అవినాష్ 5th లో ఉండగా.. అభిజీత్ ఈ సీజన్ వరెస్ట్ పెరఫార్మెర్ గా చివరి స్థానాన్ని ఎంచుకున్నాడు. అయితే గత వారం అభిజీత్ ఓ టాస్క్ పెరఫార్మెన్స్ సరిగ్గా చెయ్యని కారణంగా వరస్ట్ పెరఫార్మెర్ స్థానాన్ని తీసుకున్నాడు. సోహైల్ మాత్రం ఈ సీజన్ బెస్ట్ పెరఫార్మెర్ గా నిలిచాడు. ఇక అరియనా - సోహైల్, హరిక, అవినాష్, మోనాల్ తమ స్థానాల కోసం కొట్లాడినా చివరికి ఎమోషన్స్ ని జయించలేకపోయారు. ఇక ఈ సీజన్ వరెస్ట్ పెరఫార్మెర్ గా ఉన్న అభిజీత్ ని బిగ్ బాస్ జైలు కి పంపించాడు. ఖైదీ డ్రెస్ వేసుకుని మరీ అభిజిత్ జైలుకెళ్లాడు.
Akhil wins finale medal while Abhijeet stands at 6th position.
Akhil promoted to final, Abhijeet demoted to jail.







































