ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pooja Hegde’s Friday Tensions And New Policy

పూజా కూడా టెన్షన్ పడేదట..!

Pooja Hegde's Friday Tensions And New Policy

హీరోయిన్స్ చాలామంది కెరీర్ ఆరంభించిన కొత్తల్లో తాము నటించిన సినిమా విడుదలవుతుంది అంటే ఆ రాత్రి వాళ్ళకి నిద్రపట్టదు. తమ సినిమా హిట్ అయితే తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. లేదంటే హీరోయిన్స్ కెరీర్ గల్లంతే. అందుకే వారికి సినిమాల విడుదల అంటే యమా టెన్షన్. తాజాగా టాప్ హీరోయిన్ పూజాహెగ్డే కూడా అదే చెబుతుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఫ్రైడే వస్తుంది అంటే చాలా భయపడేదట. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో నటీనటులు ఎవరికైనా ఒత్తిడి ఉంటుంది అని.. శుక్రవారం వస్తుంది అంటే తెలియని టెన్షన్ ఫీలవుతారని చెబుతుంది. ఎందుకంటే సినిమా వాళ్ళ జాతకాలు ముడి పడి ఉండేది ఆ శుక్రవారంతోనే అని చెబుతుంది పూజాహెగ్డే.

అందరిలాగే పూజాహెగ్డే కూడా శుక్రవారం అంటే భయపడేదట. నా సినిమా విడుదలవుతుంది అంటే అందరిలాగే నేను ఉత్కంఠగా ఎదురు చూస్తుంటాను. ముందు రోజు నిద్ర కూడా పట్టేది కాదు. ఎవరి నుండి ఏం ఫోన్ వస్తుంది, ఎవరేం చెబుతారో అని తెగ టెన్షన్ ఫీలయ్యేదానిని. కానీ ఇప్పుడు అంత టెన్షన్ పడడం లేదు. ఏం జరిగినా మన మంచికే అనే పాజిటివ్‌నెస్‌తో ఆలోచించడం మొదలు పెట్టాను అని చెబుతుంది. అంతేకాకుండా తాను ఎంచుకున్న పాత్ర కోసం 100 శాతం కష్టపడతాను అని చెబుతుంది పూజాహెగ్డే. ఇక మిగతాది ప్రేక్షకులే చూసుకుంటారు. హిట్ అయితే కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అని అనుకుంటాను అంటూ ఫ్రైడే టెన్షన్ గురించి చెబుతుంది పూజా. 

Pooja Hegde Release Day Tensions

pooja hegde
release day
tension
friday tensions
new policy