Advertisementt

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్.. ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూటర్

Mon 25th May 2020 08:27 AM
film distributor,gowri shankar,turned,food distributor  ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్.. ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూటర్
Film Distributor Gowri Shankar turned Food Distributor ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్.. ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూటర్
Advertisement
Ads by CJ

ఫుడ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ‘గౌరీ శంకర్’

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, విడుదలకు సిద్ధమవుతున్న ‘నిరీక్షణ’ చిత్ర దర్శకులు మళ్ళ వంశీకృష్ణ, ‘రోషగాడు’ నిర్మాతలు మోహన్ రావు-పార్వతి, ‘హెజా’ హీరో కమ్ డైరెక్టర్ మున్నాకాశి, తూర్పుగోదావరి-రాజోలు ఫోర్ షోస్ సినీప్లెక్స్ అధినేత పాలిక శ్రీను తదితర సినీ ప్రముఖులతోపాటు.. పలు రంగాలకు చెందిన వదాన్యుల సహాయ సహకారాలతో.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్ కరోనా కష్టకాలంలో.. అనకాపల్లిలో గత కొన్ని రోజులుగా ‘అన్నదాన కార్యక్రమం’ నిర్వహిస్తున్నారు. 

భారత్ వికాస్ పరిషత్ సౌజన్యంతో.. గౌరీ శంకర్ నిర్వహిస్తున్న ఈ సేవా క్రతువుకు విశ్రాంత పోలీస్ అధికారి పీలా గోపాల్ రావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయి అవార్డు గ్రహీత శ్రీమతి పిల్లా నిర్మల వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఉడతాభక్తిగా.. కరోనా విపత్కాలంలో తాను చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి..  వివిధ రంగాలకు చెందిన అమృత హృదయులతోపాటు.. సినిమా రంగానికి చెందిన పలువురు మానవతావాదులు ఎంతో పెద్ద మనసుతో చేయూతనందిస్తుండడం తనను ముందుకు నడిపిస్తోందని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన గౌరీ శంకర్ పేర్కొన్నారు.

Film Distributor Gowri Shankar turned Food Distributor:

Film Distributor turns Food Distributor at Vizag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ