ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun and Sukumar Movie Title Leaked

‘పుష్ప’గా అల్లు అర్జున్.. అప్డేట్ ఇదే!

అల్లు అర్జున్ - సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రకటన రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజున రివీల్ చెయ్యడానికి ఓ పోస్టర్‌ని కూడా వదిలారు. అల్లు అర్జున్ పుట్టినరోజుకి సుకుమార్ ఓ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసాడట. అయితే ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ కానీ ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ వదలడం కష్టం కనక అల్లు అర్జున్ లుక్ తో పాటుగా ఆ సినిమా టైటిల్ ని వదలబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని అంటున్నారు.

అయితే బన్నీ - సుక్కు సినిమా కి రెండక్షరాల టైటిల్ అంటూ... ఇది సుక్కు - బన్నీ సెంటిమెంట్ అంటూ ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమా టైటిల్ గా పుష్ప అనే టైటిల్ ప్రచారంలోకొచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప కాబట్టి.. అందుకే ఈ సినిమాకి పుష్ప టైటిల్ పెట్టారని అంటుంటే... మరోవైపు.. ఈ సినీమాలో హీరో పేరే... పుష్పక్ నారాయణ్ గా ఈ సినిమాలో బన్నీ కనిపించబోతున్నాడట. సినిమాలో అల్లు అర్జున్ ని అంతా పుష్ప అని పిలుస్తుంటారు. అందుకే ఈసినిమాకి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేసి.. రేపు పుట్టిన రోజు కానుకగా ఈ టైటిల్ తో పాటుగా సినిమా ఫస్ట్ లుక్ కూడా వదలబోతున్నారట.

Pushpa is the Bunny and sukku Movie title

Allu Arjun and Sukumar Movie Title Leaked
pushpa
allu arjun
sukumar
title
allu arjun birthday