ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan is Still Angry on Boyapati Srinu

బోయపాటి మీద కోపంతోనే చెర్రీ అలా చేశాడా..?

Ram Charan is Still Angry on Boyapati Srinu

రామ్ చరణ్ నిన్న ఉదయం ఉన్నట్లుండి.. అవును నా సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ వినయ విధేయ రామ రిజల్ట్ ను యాక్సెప్ట్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై నెటిజన్లు అందరూ రామ్ చరణ్ ను గట్స్ ఉన్న హీరో, హానెస్టీ ఉన్న హీరో అని తెగ పొగిడేస్తే.. ఇండస్ట్రీ వర్గాలు కూడా చరణ్ ను మెచ్చుకున్నాయి. ఈ లేఖను జాగ్రత్తగా గమనిస్తే.. అభిమానిలకు, మీడియా మిత్రులకు, డిస్ట్రిబ్యూటర్స్ కు, నిర్మాతకు చరణ్ ధన్యవాదాలు తెలిపినట్లు ఉంటుంది కానీ.. ఎక్కడా దర్శకుడు బోయపాటి పేరు కనీసం ప్రస్తావించలేదు. 

దాంతో చరణ్ కి బోయపాటి సినిమాను హ్యాండిల్ చేసిన విధానం నచ్చకపోవడమే కాక విడుదలకు ముందు తనకు గానీ నిర్మాతలకు గానీ సినిమాను చూపించకపోవడం పట్ల కోప్పడ్డాడని, ప్రస్తుతానికి చరణ్, బోయపాటి మధ్య మాటల్లేవని అందుకే చరణ్ దర్శకుడు బోయపాటి పేరు మాత్రం ఇన్వాల్వ్ చేయలేదని చెవులు కోరుక్కొంటున్నారు. 

మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ కు వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ పడడం మాత్రం బాధాకరమైన విషయమే. మరి చరణ్ కి బోయపాటి మీద కోపం ఎప్పటికీ పోతుందో ఏమో. 

Ram Charan is Angry on Boyapati thats why didnt mentioned his name on the letter yesterday

ram charan
boyapati srinu
vinaya vidheya rama