ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Another benchmark crossed by Bharat Ane Nenu

'భరత్ అనే నేను' ఖాతాలో 205 కోట్లు!

టాలీవుడ్ భవిషత్తును ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలు మార్చేశాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సమ్మర్ లో విడుదల అయిన 'రంగస్థలం', 'భరత్ అనే నేను', 'నా పేరు సూర్య', 'మహానటి' సినిమాలు తెలుగు స్థాయిని పెంచేసాయి. అందులో మరీ ముఖ్యంగా రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' సినిమా..కొరటాల - మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'భరత్ అనే నేను'.

ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. 'భరత్ అనే నేను' లేటెస్ట్ గా రూ. 205 కోట్లు దాటిందని..నిర్మాత డీవీవీ దానయ్య తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తొలి రోజు నుండి రికార్డుల వేట కొనసాగిస్తున్న ఈ సినిమా మూడు వారాల్లోనే రూ. 205 కోట్లను తాకడం గమనార్హం.

తొలి రోజు 40 కోట్లుని వసూల్ చేసిన ఈ సినిమా.. మొదటివారంలో రూ. 161 కోట్లను, ఆపై రెండో వారంలో రూ.190 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓవరాల్ గా మూడువారాలు వచ్చేసరికి రూ. 205 కోట్లు గ్రాస్ ని వసూల్ చేసి రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మహేష్ జూన్ నుండి వంశీ పైడిపల్లి సినిమాలో నటించనున్నాడు.

Bharat Ane Nenu crosses Rs.205 Crore, Hunting still continuous

Another benchmark crossed by Bharat Ane Nenu
bharat ane nenu
koratala siva
mahesh babu
collections