'అజ్ఞాత‌వాసి' నైజాం దిమ్మతిరిగే రికార్డ్!!

Agnathavasi Nizam Area Record

అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూ ఇయర్ మరింత జోష్ గా జరుపుకుంటున్నారు. మొన్న ఆదివారం సాయంత్రం 'అజ్ఞాత‌వాసి' సినిమా నుండి ప‌వ‌న్ కళ్యాణ్ పాడిన 'కొడ‌కా....కోటేశ్వ‌ర్ రావు' పాట ప‌వ‌న్ ఫ్యాన్స్ కు స‌రి 'కొత్త' కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ ఒక వైపు.... ఈ సాంగ్ ఒకటి ఒక వైపు అన్నట్టుగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ సాంగ్ తో సినిమాకు మరింత హైప్ వచ్చింది.

ప్రపంచం వ్యాప్తంగా 'అజ్ఞాత‌వాసి' ఈ నెల 10 న విడుదల అవుతుంది. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కాబట్టి ఈ సినిమా హ‌క్కుల కోసం గ‌ట్టి పోటీ ఏర్ప‌డింద‌ట‌. ఈ చిత్ర నైజాం హ‌క్కులు రికార్డు స్థాయి ధ‌ర ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం నైజామ్ రైట్స్ దాదాపు 27 కోట్లకు అమ్ముడైనట్టుగా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. కేవలం నైజాంలోనే ఈ రేటు ప‌లికితే, ఇక మిగతా ప్రాంతాల్లో హ‌క్కులు, ఓవ‌ర్సీస్, శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడై ఉంటాయో అని చ‌ర్చించుకుంటున్నార‌ట‌. విడుదలకు ముందు 'అజ్ఞాత‌వాసి' ఇంత హైప్ క్రియేట్ చేస్తే.. విడుదల తర్వాత మ‌రెంత సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో అని ట్రేడ్ వ‌ర్గాలు అనుకుంటున్నారు.

Pawan Kalyan Again Shows His Stamina in Nizam

pawan kalyan
agnathavasi
kodaka song
nizam area
record