ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hero Nikhil Siddharth Got Stuck in Lift

నిఖిల్‌ గుంటూరు వారిని భయపెట్టాడు..!

Hero Nikhil Siddharth Got Stuck in Lift

సెలబ్రిటీలకు ఏమి జరిగినా అది ఓ న్యూసే అవుతుంది. వారు ఏమి చేసినా, వారికి సంబంధించిన ఏ విషయమైనా హాట్‌ న్యూసే. కొన్నిసార్లు ఈ సెలబ్రిటీ హోదా చిరాకు తెప్పిస్తే, కొన్ని సార్లు ఆనందాన్ని కలిగిస్తుంది. తాజాగా ఓ చిన్న సంఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. 

గుంటూరు నగరంలోని ఓ జిమ్‌ ఓపెనింగ్‌కి యంగ్‌ హీరో నిఖిల్‌ వచ్చాడు. ఈ సందర్భంగా ఓపెనింగ్‌ చేయాల్సిన జిమ్‌ మూడో అంతస్థులో ఉండటంతో నిఖిల్‌ ఆ జిమ్‌ నిర్వాహకులతో కలిసి లిఫ్ట్‌ ఎక్కాడు. తీరా ఈ లిఫ్ట్‌ మూడో అంతస్తుకు చేరిన తర్వాత డోర్‌ ఓపెన్‌ కాకపోవడంతో నిర్వాహకులు, నిఖిల్‌ అభిమానులు ఆందోళన చెందారు. ఈ భవనం నిర్వాహకులు లిఫ్ట్‌ని ఆన్‌, ఆఫ్‌ చేసి ప్రయ్నతించినా ఈ లిఫ్ట్‌ డోర్స్‌ ఓపెన్‌కాలేదు. 

దీంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి లిప్ట్‌ డోర్స్‌ని గడ్డపారలతో పగులగొట్టడంతో నిఖిల్‌ సురక్షితంగా బయటకు వచ్చాడు. దీంతో నిర్వాహకులతో పాటు పోలీసులు, నిఖిల్‌ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆ జిమ్‌ ఓపెనింగ్‌ని యథాతధంగా చేసి నిఖిల్‌ హైదరాబాద్‌ ప్రయాణమయ్యాడు. సాధారణంగా ఇది సామాన్యంగా తరుచుగా జరిగే పనే. కానీ నిఖిల్‌ లిఫ్ట్‌లో ఉండటంతో ఇదో పెద్ద న్యూస్‌ అయిపోయింది. అది సంగతి.....! 

Nikhil got Stuck in lift at Guntur

nikhil siddharth
lift
stuck
guntur