వినాయకచవితి 'లవ' మయం..!
Jr NTR Lava Teaser Release Details'జై లవ కుశ' సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్... ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడే అదిరిపోయే ట్రీట్స్ ఇస్తున్నాడు. సినిమా మొదలైన కొద్ది రోజులకే 'జై లవ కుశ' టైటిల్ మోషన్ పోస్టర్ తో దిగిపోయిన 'జై లవ కుశ' వెనువెంటనే ఎన్టీఆర్ బర్త్ డే కి 'జై' ఫస్ట్ లుక్ తో రచ్చ చేశాడు. అలాగే 'జై' టీజర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్ మొన్న రక్షాబంధన్ కానుకగా 'లవ' లుక్ తో ఇంప్రెస్ చేశాడు. 'లవ కుమార్' లుక్ మరీ సాఫ్ట్ గా ఉందంటూ కామెంట్స్ పడ్డా.. కానీ.. 'లవ' టీజర్ కోసం మాత్రం ఎదురు చూపు మాత్రం తగ్గలేదు.
ఒక్కో టీజర్ ని జాగ్రత్తగా వదులుతున్న ఎన్టీఆర్ అండ్ బ్యాచ్ ఇప్పుడు ఈ వినాయకచవితి పండుగ సందర్భంగా 'లవ' టీజర్ తో దున్నేస్తారట. 'జై లవ కుశ' లోని మూడు పాత్రలకు మూడు టీజర్స్ ని తయారు చేసి ఎన్టీఆర్ అభిమానులకు పండగ తీసుకొస్తున్న డైరెక్టర్ బాబీ ఇప్పుడు రాబోయే 'లవ' టీజర్ ని ఎలా చూపించబోతున్నాడో అనే సస్పెన్స్ లో ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 'కుశ' పాత్రకి సంబందించిన లుక్ గాని టీజర్ గాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశలో ఎన్టీఆర్ ఫాన్స్ ఆత్రుత ఎక్కువైంది.
ఇక సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తున్న 'జై లవ కుశ' చిత్రం సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాసి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తున్నారు.
Young Tiger NTR, Kalyan Ram and Bobby movie Jai Lava Kusa Latest Update







































