బన్నీ పోటీని పవర్‌స్టార్‌ తట్టుకుంటాడా...?

అల్లుఅర్జున్‌ నటించిన సరైనోడు చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని కర్ణాటకలో మరీ ముఖ్యంగా బెంగుళూర్‌లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకోసం బెంగుళూరులోని కొన్ని థియేటర్లను బ్లాక్‌ చేశారు. కానీ కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం చక్రవ్యూహ కూడా రేపు విడుదల కానుంది. కాగా గతంలో పునీత్‌ నటించిన రానా విక్రమ, బన్నీ నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు కూడా ఒకే రోజున విడుదల అయ్యాయి. అందులోనూ సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర నటించడంతో ఈ చిత్రం ఓపెనింగ్స్‌ విషయంలో బెంగుళూరులో రానా విక్రమను మించిపోయింది. అలాగే  ఇప్పుడు సరైనోడు, చక్రవ్యూహ కూడా ఒకే రోజున విడుదల కానుండటం పునీత్‌ అభిమానులను టెన్షన్‌ పెడుతోంది. అయితే ఈ సారి బన్నీ చిత్రంలో కన్నడ నటులు లేరు. కేవలం తమిళ ఇండస్ట్రీని ఈ చిత్రంతో బన్నీ టార్గెట్‌ చేశాడు. అందుకే తమిళంలో గుర్తింపు ఉన్న రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌, అంజలి, ఆది పినిశెట్టి వంటి వారిని పెట్టుకున్నాడు. ఎంత తమిళ మార్కెట్‌ను టార్గెట్‌ చేసినా సరైనోడుకు బెంగుళూరులో భారీగానే ఓపెనింగ్స్‌ రావడం ఖాయమని అంటున్నారు. మరోవైపు చక్రవ్యూహ చిత్రాన్ని కూడా చూడాలని కొందరు తెలుగు ఆడియన్స్‌ భావిస్తున్నారు. దానికి కారణం ఇందులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ పాటను పాడటమే .మరి ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది...! 

sarrainodu
chakravyuha
sarrainodu kannada release
power star
allu arjun
puneeth raj kumar