బాలయ్య సినిమాకు 5గురు రైటర్లు!

ప్రస్తుతం తన 98వ చిత్రంగా ‘లయన్‌’ చిత్రం చేస్తోన్న బాలకృష్ణ తన 99వ చిత్రంగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించే చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.కాగా ఈ చిత్రానికి ‘డిక్టేటర్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ఈచిత్రం కోసం మొత్తం ఐదుమంది రచయితలు పని చేస్తుండటం విశేషం. కోనవెంకట్‌, గోపీమోహన్‌, బి.వి.ఎస్‌.రవిలు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ జోడీకి కొత్తగా శ్రీధర్‌ సీపాన కూడా చేరాడు. ఆల్‌రెడీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శ్రీవాస్‌ కూడా రచయితే కావడం గమనార్హం. మొత్తానికి ఇప్పటికి ఈ చిత్రం రచయితల సంఖ్య అధికారికంగా ఐదుకు చేరింది. వీరందరూ కలిసి బాలయ్య కోసం బ్రహ్మాండమైన స్క్రిప్ట్‌ను తయాచు చేస్తున్నారట. వంటగాళ్లు ఎకువైతే వంట తగలడుతుంది... అనే సామెత ఈచిత్రానికి పని చేయకుండా ఉంటే అదే చాలు....!

balakrishna
5 writers
balakrishna 99th movie details
srivaas director
dictator movie