ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Will Nikhil’s Swayambhu Release This Year

ఈ ఏడాది స్వయంభు కి మోక్షం ఉంటుందా?

Will Nikhil’s Swayambhu Release This YearWill Nikhil’s Swayambhu Release This Year


నిఖిల్ స్వయంభు కి ఈ ఏడాది అయినా మోక్షం ఉంటుందా? ఈ అనుమానం ఎందుకొచ్చింది ఆడియన్స్ లో. ఎప్పుడో ఏప్రిల్ లో షూటింగ్ ఫినిష్ చేసుకుని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నా, ఈ చిత్రం ఇప్పటికి విడుదల తేదీ విషయంలో మీనమేషాలు లెక్కించడమే కామెడీ అయ్యింది.

దసరాకి విడుదల చేస్తారేమో అన్నప్పటికీ.. దసరా వచ్చేసింది. స్వయంభు చప్పుడు లేదు. కనీసం ఈ దసరా విజయదశమి సందర్భంగా అయినా స్వయంభు విడుదల తేదీ ఖరారు చేస్తారేమో అనే చిన్న ఆశ నిఖిల్ అభిమానుల్లో కనిపిస్తుంది. సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, అన్ని పూర్తయిప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఎందుకో ముందడుగు వేయలేకపోతున్నారు.

ఓటీటీ డీల్ పూర్తి కాకపోవడమే అనే టాక్ ఉన్నప్పటికీ.. ఓ పది కోట్లకి అటు ఇటుగా సినిమాని వదిలించుకోవాలి కానీ... ఇలా మరుగున పడేయడం ఏమిటో నిర్మాతలకే తెలియాలి. మరి నిఖిల్ కూడా స్వయంభు విడుదల ఈ ఏడాది ఉంటుందా, రిలీజ్ తేదీ విషయంలో హీరో నిఖిల్ ఓ స్టెప్ తీసుకుంటే బావుంటుంది అనేది ఆడియన్స్ సజెషన్.

 

 

Swayambhu: Will Nikhil Get a Release Date This Year