ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kriti Sanon Teams Up With Maddock Films for Third Time

మ్యాడాక్ ఫిల్మ్స్‌తో కృతి సనన్ హ్యాట్రిక్ కాంబినేషన్!

Kriti Sanon Teams Up With Maddock Films for Third TimeKriti Sanon Teams Up With Maddock Films for Third Time

 

బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్ `మిమి`, `స్త్రీ` వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ తో  మరోసారి చేతులు కలిపారు. గతంలో మ్యాడాక్ బ్యానర్‌లో కృతి చేసిన `మిమి` చిత్రానికి ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి  కాంబినేషన్ పూర్తిగా సరికొత్త జానర్‌ను ఎంచుకుని భారీ స్థాయి ఔట్-అండ్-ఔట్ హారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే మ్యాడాక్ ఫిల్మ్స్  హారర్-కామెడీ యూనివర్స్‌లో భాగంగా `స్త్రీ`, `భేడియా`, `ముంజ్యా` వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించింది. కాగా కృతి సనన్‌తో నిర్మించబోయే ఈ నూతన చిత్రం హారర్-కామెడీ కాకుండా పూర్తి స్థాయి భయానక వాతావరణంతో  హారర్ థ్రిల్లర్‌గా రాబోతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ .. ఎమోషనల్ పాత్రల్లో అలరించిన కృతి ఈ చిత్రంతో  సరికొత్త నటనను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

త్వరలోనే సినిమా టైటిల్, దర్శకుడు , ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్నమైన కథలను ఎంచుకునే కృతి సనన్.. మ్యాడాక్ ఫిల్మ్స్‌తో కాంబినేషన్ పునరావృతం చేస్తుండటంతో  సినిమాపై  అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
 

Maddock Films and Kriti Sanon Continue Their Successful Run