తండ్రి కావాలనుకుంటోన్న స్టార్ హీరో!
Salman Khan Wants to Become a Father
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం - తండ్రి కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాఫీ విత్ కరణ్ 9 టాక్ షోలో పాల్గొన్న సందర్భంలో తనకు పిల్లలు లేకపోవడం లోటుగా అనిపిస్తుందని సల్మాన్ అంగీకరించారు. హోస్ట్ కరణ్ జోహార్తో జరిగిన సంభాషణలో.. తండ్రి కావడం అనేది తానూ అనుభవించాలనుకుంటున్న మధురమైన విషయమని సల్మాన్ పేర్కొన్నారు. వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్న 60 ఏళ్ల సల్మాన్ ఖాన్ ఈ షోలో తన కుటుంబం, భావోద్వేగాలు , తోడు గురించి పలు విషయాలు పంచుకున్నారు.
ఈ టాక్ షో ప్రోమోలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ మధ్య సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో కూడా సల్మాన్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిల్లలంటే చాలా ఇష్టమని, సంతానం పొందేందుకు ప్రయత్నించినా? భారతీయ చట్టాల కారణంగా సాధ్యపడలేదన్నారు. తన కుటుంబంలో ఎంతోమంది పిల్లలు ఉన్నా? సొంతంగా ఒక బిడ్డను పెంచాలనే కోరిక ఉందని, చట్టపరమైన నిబంధనలు లేదా పెళ్లి ద్వారా ఆ అవకాశాన్ని పరిశీలిస్తానని గతంలో పేర్కొన్నారు.
మరోవైపు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం - డేటింగ్ వార్తలతో నిత్యం మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. రొమేనియన్ నటి , సింగర్ లులియా వంతూర్తో సల్మాన్ కు ఉన్న సాన్నిహిత్యంపై చాలా కాలంగా ప్రచారాలు సాగుతున్నా? ఇద్దరూ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే సల్మాన్ నటించిన `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` త్వరలో రిలీజ్ కానుంది.
















































