ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Katrina Kaif's Brand Now Available on UK TikTok Shop

యూకే టిక్‌టాక్ షాప్‌లో కత్రినా బ్రాండ్

Katrina Kaif's Brand Now Available on UK TikTok ShopKatrina Kaif's Brand Now Available on UK TikTok Shop

 

బాలీవుడ్ ప్రముఖ నటి కత్రినా కైఫ్ స్థాపించిన ప్రఖ్యాత మేకప్ బ్రాండ్ కే బ్యూటీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకు వేసింది. యూకే (UK) మార్కెట్‌లోని వినియోగదారులకు మరింత చేరువయ్యేలా ఈ బ్రాండ్ తాజాగా టిక్‌టాక్ షాప్ లో అధికారికంగా లాంచ్ అయినట్లు సంస్థ ప్రకటించింది. సౌందర్య పోషణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ఆదరణ పొందిన మేకప్ ఉత్పత్తులన్నీ ఇకపై ఒక్కచోటే సులభంగా లభించనున్నాయి.

ఈ చారిత్రాత్మక మైలురాయిని బ్రాండ్ ఫౌండర్ కత్రినా కైఫ్ స్వయంగా తన ఆనందాన్ని  అభిమానులతో పంచుకున్నారు. యూకే టిక్‌టాక్ కమ్యూనిటీలోకి కే బ్యూటీకి స్వాగతం పలుకుతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామని, ఇది సరికొత్త బ్యూటీ అనుభూతిని పంచుతుందని బ్రాండ్ వర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియా వేదికగా మేకప్ ప్రియులకు సరికొత్త ఫేవరెట్ ప్రొడక్ట్స్‌ను అన్వేషించడానికి ఇది చక్కటి వేదికగా మారుతుందని భావిస్తున్నారు.

Katrina Kaif's Brand Makes a Big Move in the UK