ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika, Vijay Deverakonda Finally Open Up About Their 8-Year Love

8 ఏళ్ల సీక్రెట్ లవ్‌పై రష్మిక, విజయ్ ఓపెన్ కామెంట్స్!

Rashmika, Vijay Deverakonda Finally Open Up About Their 8-Year LoveRashmika, Vijay Deverakonda Finally Open Up About Their 8-Year Love

 

టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దంపతులు ఎనిమిదేళ్ల బంధం గురించి, ఆ రిలేష‌న్ షిప్ ని మీడియాకు  గోప్యంగా ఉంచడంపై తొలిసారి స్పందించారు.  తమ ప్రేమ వ్యవహారాన్ని దాచడం తమ ఉద్దేశం కాదని, తమ వ్యక్తిగత జీవితంపై ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే గోప్యత పాటించామని విజయ్ స్పష్టం చేశారు. `ఎనిమిదేళ్ల క్రితం కొలీగ్స్‌గా ప్రారంభమైన మా ప్రయాణం స్నేహంగా, ఆపై ప్రేమగా మారి ఇప్పుడు భార్యాభర్తల స్థాయికి చేరింది.

గతేడాది కాలంగా రష్మికతో వర్కవుట్స్ చేయడం, షూటింగ్ చేయడంలో ఎంతో హాయిగా అనిపించేది. చివరికి భోజనం చేసేటప్పుడు కూడా తను పక్కన ఉంటే బాగుండు అనిపించింది. నా జీవితంలో తను లేని లోటు తెలిసి  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను` అని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ ..`మా సంబంధం పబ్లిక్ వినోదం కోసం కాదు. అది మా ఇద్దరి కోసం ఏర్పడింది. మేము కాపాడుకోవాలనుకున్న వ్యక్తిగత విషయాలను బయట చర్చించకూడదని భావించాం` అని తెలిపారు.

`గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల తర్వాత ఈ హిట్ జంట కలిసి నటిస్తున్న మూడో చిత్రం `రణబలి`. వివాహం తర్వాత కలిసి నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 16న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 

The 8-Year Rashmika-Vijay Mystery Gets Interesting