ఆదర్శ కుటుంబం విడుదలపై గందరగోళం!
Aadarsha Kutumbam backing off
విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ `ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47` విడుదల తేదీపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. తొలుత 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత అక్టోబర్ 2కి.. ఆపై అక్టోబర్ 9కి వాయిదా వేశారు. అయితే తాజాగా అక్టోబర్ 9న కూడా ఈ సినిమా రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అక్టోబర్ 9 డేట్ మిస్ అయితే ప్రత్యామ్నాయంగా అక్టోబర్ 17 లేదా అక్టోబర్ 30 తేదీలను యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ అక్టోబర్ 17న విడుదల చేయాలనుకుంటే? ఆ రేసులో ఇప్పటికే `జైలర్2`, `రణబలి` చిత్రాలు ఉన్నాయి. విశేషమేమిటంటే? జైలర్ 2 తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను నాగవంశీనే దక్కించుకోవడంతో అక్టోబర్ 17 తేదీ ఆసక్తికరంగా మారింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం పడితే.. అక్టోబర్ 30న రావడం వల్ల మేకర్స్‌కు తగినంత సమయం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ రెండు తేదీలపై కూడా నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ విడుదల గందరగోళానికి అక్టోబర్ 6న విడుదల కానున్న ట్రైలర్‌తో తెరపడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారమే ట్రైలర్ బయటకు వస్తే సినిమా అక్టోబర్ 9నే విడుదలవుతుందని భావించవచ్చు. ఒకవేళ ట్రైలర్ రిలీజ్‌లో మార్పు లు చోటు చేసుకుంటే? సినిమా వాయిదా పడటం ఖాయమని తెలుస్తుంది.
















































