స్పిరిట్ షూటింగ్‌పై సస్పెన్స్.. ప్రభాస్ రీఎంట్రీపై లేటెస్ట్ అప్‌డేట్!
Doubts over Prabhas entry
రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `స్పిరిట్` చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్‌పై 50 రోజుల చిత్రీకరణ రెండు నెలల క్రితమే పూర్తయింది. అనంతరం ప్రభాస్ `ఫౌజీ` షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే సెప్టెంబర్‌లోనే `స్పిరిట్` తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుందని ప్రభాస్ మళ్లీ సెట్స్‌లోకి వస్తారని అందరూ భావించినా? రెండు నెలలు గడిచినా ఆయన రాకపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న `స్పిరిట్` కొత్త షెడ్యూల్ ప్రభాస్ లేకుండానే కొనసాగుతోంది. దాంతో `ఫౌజీ` కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకుని ప్రభాస్ ఎప్పుడు `స్పిరిట్` సెట్స్‌లోకి అడుగుపెడతారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు డిసెంబర్ 3 2026లో రావాల్సిన `ఫౌజీ` చిత్రం అధికారికంగా 2027కి వాయిదా పడింది. ఈ మార్పు కారణంగా ఇప్పటికే మార్చి 5 2027న విడుదల చేస్తామని ప్రకటించిన `స్పిరిట్` రిలీజ్ డేట్ కూడా మారవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
















































