ఇంతలోనే జాన్వీ స్టన్నింగ్ లుక్ వైరల్
Jhanvi stunning New lookనటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఒకవైపు దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను దుండగులు అసభ్యకరంగా ఏఐ డీప్ ఫేక్ మార్ఫింగ్ చేయగా.. దానిపై తీవ్రంగా స్పందించి వార్తల్లో నిలిచిన జాన్వీ మరోవైపు ఇన్ స్టాలో గ్లామరస్ లుక్స్ ని షేర్ చేయడంలో తగ్గేదేలే అంటూ దూసుకెళుతున్నారు. ఈ రెండు భిన్నమైన అంశాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
జాన్వీ కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ ఫ్యాషన్ లగ్జరీ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ న్యూ*డ్ లిప్ ఎమోజీని జతచేశారు. ఈ స్టైలిష్ లుక్‌లో జాన్వీ చాలా అందంగా కనిపించడంతో అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. చాలామంది ఫేవరెట్ లుక్ ఇప్పటివరకూ..అని, మరికొందరు మీము గర్ల్ అద్భుతం అంటూ స్పందిస్తున్నారు. జాన్వీ సోదరి ఖుషీ కపూర్ డైయింగ్ అని కామెంట్ చేయగా.. కామెంట్స్ సెక్షన్ అంతా హార్ట్, ఫైర్ ఎమోజీలతో నిండిపోయింది. ఈ కష్టకాలంలో జాన్వీ కపూర్‌కు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని వదిలి పెట్టనని ఎన్టీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, ఖుష్బూ తదితరులు అండగా నిలవగా.. తనకు సంఘీభావం తెలిపిన వారందరికీ జాన్వీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ - ప్రైవసీని కాపాడుకోవడంలో ఈ మద్దతు ఎంతో కీలకమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి ఒకవైపు ట్రెండీ ఫ్యాషన్ ఫొటోలతో కుర్రకారును అలరిస్తూనే.. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చిపెడుతున్న డీప్ ఫేక్ ముప్పులపై జాన్వీ కపూర్ ధైర్యంగా స్పందించడం ప్రశంసనీయం. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. డిజిటల్ భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
















































