రణబాలి ట్రైలర్ కోసం వెయిటింగ్
Waiting for Ranabaali Trailer
విజయ్ దేవరకొండ వరస సినిమాల రిజల్ట్ తో డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు. ఆయన అభిమానులు కూడా విజయ్ దేవరకొండ కు హిట్ పడే క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి తర్వాత యువ హీరోలు సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టుగా విజయ్ దేవరకొండ కూడా సక్సెస్ ట్రాక్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు.
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ భార్య రష్మిక తో కలిసి మొదటిసారి నటించిన రణబాలి చిత్రం దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ నెల 16 న విడుదలకు సిద్దమవుతుంది. రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర పాన్ ఇండియా ప్రమోషన్స్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి.
మరోపక్క రణబాలి ట్రైలర్ కోసం అభిమానులే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురు చూసేలా చిత్ర ప్రమోషనల్ టూర్ కనిపిస్తుంది. రణబాలి నుంచి రీసెంట్ గా వచ్చిన ఏందయ్యా సామి సాంగ్ విజువల్ గా, మ్యూజికల్ గా మ్యూజిక్ లవర్స్ కి బాగా ఎక్కేసింది. ఇప్పడు రణబాలి ట్రైలర్ వస్తే సినిమా ఓపెనింగ్స్ పై ఓ క్లారిటీ వస్తుంది.
మరి రణబాలి క్రేజ్ ఎంత అనేది ఇప్పుడు ట్రైలర్ డిసైడ్ చేసేలా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా నాని ప్యారడైజ్ కి ట్రైలర్ లేకపోవడం మైనస్ అయ్యింది అనే అభిప్రాయాల నడుమ రణబాలి ట్రైలర్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.
















































