హిందీలో దుమ్మురేపుతున్న దృశ్యం 3
Drishyam 3 Creating a Storm in Hindi
మలయాళంలో హిట్ ఫ్రాంచైజీ దృశ్యం చిత్రం పార్ట్ 1, 2, 3 చిత్రాలను హిందీలోనూ అజయ్ దేవగన్ రీమేక్ చేసారు. మలయాళంలో మోహన్ లాల్ - మీనా కీ రోల్స్ ప్లే చెయ్యగా.. హిందీలో అజయ్ దేవగన్-శ్రీయ కీ రోల్స్ ప్లే చేసారు. మలయాళంలో దృశ్యం పార్ట్ 1, 2 లు సూపర్ హిట్ లుగా నిలిచాయి. హిందీలో ఆ రెండు భాగాలూ యావరేజ్ గా ఆడాయి.
ఇక దృశ్యం 3 మలయాళంలో యావరేజ్ గా నిలిచింది. కానీ హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం ది కంక్లూజన్ చిత్రం అజయ్ దేవగన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఈ చిత్రం మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.95.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు కూడా దృశ్యం 3 నార్త్ లో అదే ఫ్లో కంటిన్యూ చేసింది.
దృశ్యం 3 హిందీలో విడుదలకు ముందే భారీ అంచనాలు మూటగట్టుకుంది. టికెట్ బుకింగ్స్ లోను లోను రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఈ లాంగ్ వీకెండ్ లో హిందీ దృశ్యం 3 అజయ్ దేవగన్ కెరీర్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వీకెండ్ మాత్రమే కాదు.. దృశ్యం 3 బాక్సాఫీసు రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు.
















































