థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీ లోను బ్లాక్ బస్టరే!
Bethlehem Family Unit Trending on JioHotstar
బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ చిత్రం మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నివిన్ పౌలి-మమిత బైజు జంటగా తెరకెక్కిన బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ చిత్రం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు .
ఏజ్ గ్యాప్ ప్రేమ, సరదా సంభాషణలు, నివిన్ పౌలి, మమిత బైజు యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, BGM అన్ని సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. దానితో మలయాళ ప్రేక్షకులే కాకుండా ఈ క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీని పాన్ ఇండియా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసారు.
ఇప్పుడు బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి వచ్చాక కూడా అదిరిపోయే రెస్సాన్స్ తెచ్చుకుంది. జియో హాట్ స్టార్ లో బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ స్ట్రీమింగ్ లోకి రాగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని వీక్షించేస్తున్నారు.
దానితో ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ చిత్రం థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను బిగ్ హిట్ గా పరుగులు పెడుతుంది.
















































