ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> BB10: Nagarjuna Tells Rohit to Get Out, Yellow Card for Trigun

BB10: రోహిత్ ని గెటౌట్ అన్న నాగ్- త్రిగున్ కి ఎల్లో కార్డ్

BB10: Nagarjuna Tells Rohit to Get Out, Yellow Card for TrigunBB10: Nagarjuna Tells Rohit to Get Out, Yellow Card for Trigun


బిగ్ బాస్ సీజన్ 10 గత రాత్రి అంటే శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ని ఒణికించేశారు. రావడం రావడమే రోహిత్, త్రిగున్, అమన్ లను లివింగ్ రూమ్ నుంచి గార్డెన్ ఏరియా లోకి పంపించేశారు. ఈమద్యలో హౌస్ లోని ముఖేష్, అపూర్వ, షాలిని, రామ్ ప్రసాద్ లపై  నాగ్ ఫైర్ అయ్యారు.

రోహిత్ కి సంబందించిన ఓ వీడియో  క్లిప్ ని చూపించారు ఆడియన్స్ కి నాగార్జున. అందులో చరణ్ రోహిత్ మాట్లాడుకుంటున్నారు. రోహిత్ చరణ్ తో మాట్లాడుతూ బిగ్ బాస్ నన్నేం పీకలేడు అన్నట్టుగా హెయిర్ పీకి చూపించాడు. అదే నాగ్ అన్నారు, బిగ్ బాస్ ఏం పీకలేడు అనేగా నీ ఉద్దేశ్యం అన్నారు నాగ్,

అది కాదు సర్ అని రోహిత్ అంటే ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు రోహిత్ బిగ్ బాస్ ఏమి పీకలేడు అనేనా అనగానే ఆడియన్స్ అంతా రోహిత్ అదే ఉద్దేశ్యంతో చూపించాడు అనగానే నాగర్జున నా హౌస్ లో నువ్ ఉండొద్దు అంటూ గేట్స్ ఓపెన్ చేసారు.

ఇక త్రిగున్ నువ్వు ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా, ఆడింగి వాడివి అంటూ ఉమ్మి ఉస్తావా అంటూ త్రిగున్ రోహిత్ తో గొడవ పడిన వీడియో వేసి చూపించడమే కాదు త్రిగున్ కి ఎల్లో అకార్డ్ చూపించి ఫైనల్ వార్నింగ్, మరోసారి మాట జారితే ఇంటికే అంటూ  త్రిగున్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగ్.

అమన్ ను పిలిచి గల్లీ లో కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటున్నారు అంటూ అమన్ కి కూడా నాగార్జున ఎల్లో కార్డ్ చూపించారు. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ నాగ్ ఇచ్చిన వార్నింగ్ లతో హౌస్ మేట్స్ వణికిపోయారు.
 

BB10: Nagarjuna Warns Rohit, Yellow Card for Trigun