మాస్ రాజా కొత్త కండీషన్లు ఒప్పుకునేది ఎంత మంది?
Who will accept Ravi Teja's New conditions
మాస్ మహారాజా రవితేజ నటించిన `ఇరుముడి` బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లతో భారీ సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. వరుస ప్లాపుల తర్వాతి కాలంలో వచ్చిన సక్సెస్ ఇది. ఈ ఘనవిజయం రవితేజ బాక్సాఫీస్ మార్కెట్ రేంజ్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ సక్సెస్ తర్వాత రవితేజ తదుపరి సినిమాలకు పారితోషికం లెక్కలను భారీగా సవరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
కేవలం ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అడగడమే కాకుండా ప్రముఖ ఏరియా రైట్స్ లేదా బిజినెస్ షేరింగ్ కండిషన్లను కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఏరియా హక్కులు కోరడం బిజినెస్ పరంగా హీరోకు లాభదాయకమే అయినా? నిర్మాతల కోణంలో ఇది కొత్త సమీకరణాలకు దారితీస్తోంది.
మాస్ రాజా విధిస్తున్న కొత్త షరతులు, భారీ పారితోషికం డిమాండ్ల పట్ల కొంతమంది నిర్మాతలు పునరాలోచనలో పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి రెమ్యూనరేషన్ లెక్కల వల్లే హసిత్ గోలి దర్శకత్వంలో రావాల్సిన ఓ ప్రాజెక్ట్ ఆలస్యమవ్వడం వంటి వార్తలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. మీడియం బడ్జెట్ సినిమాలకు ఈ స్థాయి పారితోషికం , ఏరియా రైట్స్ ఇవ్వడం ఆర్థికంగా భారం కానుండటంతో రవితేజ కొత్త కండిషన్లకు ఎంతమంది నిర్మాతలు అంగీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
















































