హీరో జీవితాన్నే మార్చేసిన తండ్రి స్థానం!

Kunal Kapoor Opens Up on FatherhoodKunal Kapoor Opens Up on Fatherhood

 

బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్  జీవితంలో ఎదురైన సరికొత్త అనుభవం.. తండ్రిగా మారిన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. `రంగ్ దే బసంతి` లాంటి విలక్షణమైన చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కునాల్  ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పితృత్వం  వ్యక్తిత్వాన్ని ఎంతగా మెరుగు పరిచిందో వివరించారు. ఒక బిడ్డకు తండ్రి కావడం అనేది మనిషిలో బాధ్యతను, సహనాన్ని పెంచు తుందని వ్యాఖ్యానించారు.

తండ్రి కాకముందు వరకు తన ఆలోచనలు, నిర్ణయాలు కేవలం తనపై ..తన కెరీర్‌పై మాత్రమే దృష్టి సారించేవన్నారు . కానీ బిడ్డ పుట్టిన తర్వాత జీవితం పట్ల ఉన్న దృష్టి కోణమే పూర్తిగా మారిపోయిందన్నారు. `తండ్రిగా నాలోని సరికొత్త కోణాన్ని నేనే ఆవిష్కరించుకున్నాను. ఈ మార్పు నన్ను మరింత మెరుగైన మనిషిగా, పరిణతి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దింది` అని సంతోషంగా పంచుకున్నారు.

పిల్లలతో సమయాన్ని గడపడం ద్వారా వచ్చే ఆనందం మరే దేనిలోనూ లభించదని కునాల్ కపూర్ అన్నారు. ప్రతిరోజూ వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటామని, వారి చిరునవ్వులు జీవితంలోని అన్ని ఒత్తిళ్లను మరిపించేలా చేస్తాయని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు పెరిగిన తర్వాత జీవితాన్ని మరింత అర్థవంతంగా చూడటం ప్రారంభించానని.. తనలో సహనం, దయాగుణం కూడా మునుపటి కంటే పెరిగాయ‌న్నారు.

తండ్రిగా మారిన అనుభవం నటనపై కూడా సానుకూల ప్రభావం చూపిందని కునాల్ కపూర్ వెల్లడించారు.  నటుడిగా భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకోవడానికి.. తెరపై పాత్రలను మరింత సహజంగా పండించడానికి పితృత్వం అందించిన మానసిక పరిణతి ఎంతగానో ఉపయోగపడుతోందని  తెలిపారు. మునుపటి కంటే ఇప్పుడు   ఎమోషనల్ సీన్స్‌లో మరింత లీనమై నటించగలుగుతున్నానన్నారు.
 

Kunal Kapoor on Life After Becoming a Father