ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Could Suhas’ Mandadi Enter the Oscars Race

ఆస్కార్ బ‌రిలోకి సుహాస్ సినిమా?

Could Suhas’ Mandadi Enter the Oscars RaceCould Suhas’ Mandadi Enter the Oscars Race



భారతీయ చిత్రసీమ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆస్కార్ బరిలోకి వెళ్లినా `ఉత్తమ విదేశీ చిత్రం` కేటగిరీలో ఇప్పటివరకు మనకు ప్రధాన పురస్కారం దక్కలేదనే లోటు మిగిలే ఉంది. ఆర్.ఆర్.ఆర్ సాధించిన ఒరిజినల్ సాంగ్ అవార్డు దేశానికి గర్వకారణమే అయినా.. ఒక సినిమా కథాత్మకంగా సాధించే సంపూర్ణ ఆస్కార్ గౌరవం ఇంకా మిగిలే ఉంది. అయితే ఈ కల నెరవేరే సత్తా తన ఆత్మీయ మిత్రుడు సుహాస్ నటించిన తాజా చిత్రం `మందాడి`కి ఉందంటూ దర్శకుడు శివ నిర్వాణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కోలీవుడ్ కథానాయకుడు సూరి `ముత్తుకాళి`గా, సుహాస్ `పులి` అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించిన ఈ పాన్-ఇండియా చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో శివ నిర్వాణ మాట్లాడుతూ.. వేదికపైకి రాగానే మాటలు రానంతగా ఎమోషనల్ అయ్యానని..  జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, గాయకుడు అభినవ్ స్వరాలు తనను ఎంతగానో కట్టిపడేశాయని పేర్కొన్నారు.

నడిసముద్రం, మత్స్యకారుల రేసింగ్ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మధిమారన్ ఏమాత్రం గ్రీన్ మ్యాట్ లేదా చీటింగ్ షాట్స్ వాడకుండా.. ఒరిజినల్ లొకేషన్లలో నటీనటుల రక్తస్వేదాలతో అత్యంత నిజాయితీగా తెరకెక్కించారని కొనియాడారు. గరుడన్, విడుదల-1 చిత్రాలతో అజేయమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సూరి విలక్షణతను, `మజిలీ`తో పరిచయమై `కలర్ ఫోటో`తో జాతీయ స్థాయికి ఎదిగిన సుహాస్ నటనా విశ్వరూపాన్ని చూసి తాను అబ్బురపడ్డానని తెలిపారు. ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్.రెడ్ కుమార్ నిర్మించి, వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సముద్ర తీర దృశ్యకావ్యం.. ప్రేక్షకులు కొనే ప్రతి టికెట్‌కు న్యాయం చేస్తూ జాతీయ పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ స్థాయి వరకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని శివ నిర్వాణ ధీమా వ్యక్తం చేశారు.

Suhas’ Mandadi Gets Oscar-Worthy Praise