సాహసోపేత రెస్క్యూ కథలో యంగ్ హీరో!
Kartik Aaryan’s Captain India First Look
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తోన్న యాక్షన్ డ్రామా `కెప్టెన్ ఇండియా`కు సంబంధించిన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ అయింది. ఇందులో కార్తీక్ పైలట్ యూనిఫాంలో అదిరిపోయాడు. పైలెట్ ఆహార్యంలో కార్తీక్ ఒదిగిపోయాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. `చక్ దే ఇండియా` ఫేమ్ దర్శకుడు షిమిత్ అమిన్ తెరకెక్కిస్తున్న చిత్రంపై బాలీవుడ్‌లో తొలి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఫస్ట్ లుక్ అంచనాలు అంతకంతకు రెట్టింపు చేస్తోంది.
భారత చరిత్రలో నిలిచిపోయిన అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ మిషన్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యుద్ద ప్రాంతం నుంచి వేలాది మంది ప్రజలను సురక్షితంగా మాతృభూమికి చేర్చే పైలట్ పాత్రలో కార్తిక్ ఆర్యన్ కనిపించనున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలోనూ షూటింగ్ నిర్వహించిన టీమ్ త్వరలోనే లండన్ పరిసర ప్రాంతాలలో ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. అందుకోసం భారీ స్థాయిలో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు.
హన్సల్ మెహతా మరియు- హర్మన్ బావేజా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కార్తిక్ ఆర్యన్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న కార్తిక్ పీరియడ్ రెస్క్యూ డ్రామా నటనతో మరోసారి ప్రేక్షకులను తప్పక అలరిస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.







































