ప్రేమపై నమ్మకం పోలేదు కానీ మళ్లీ పెళ్లి పై మాత్రం!
Isha Rikhi Opens Up On Love And Marriage
15 ఏళ్లగా హిందీ -పంజాబీ చిత్రసీమలో నటిగా రాణిస్తున్న ఇషా రిఖి వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియాకి దూరంగానే ఉంచారు. అయితే రాపర్-సింగర్ బాద్షాతో ఇషా వివాహం -గత వారం వారిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇషా దీనిపై స్పందించారు. తమ మధ్య విభేదాలు వచ్చి విడిపోయిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. గడిచిన కొంత కాలగా తాను కష్టమైన కాలాన్ని ఎదుర్కొన్నానని.. అయితే వ్యక్తిగత జీవితాన్ని ఎవరి ముందూ బహిరంగంగా చర్చించి తమాషా చేయకూడదనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని తెలిపారు.
మొదట్లో ఎవరినైనా గుడ్డిగా నమ్మి భావోద్వేగపరంగా ఆధారపడేదాన్నని, కానీ ఈ అనుభవాలు తనను మరింత దృఢంగా మర్చాయన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదని.. ప్రేమించిన వ్యక్తిని.. ఆ బంధాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు కొన్ని విషయాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు. తనపై వస్తున్న విమర్శలను తట్టుకోలేకపోయినా? కాలంతో పాటు తాను ఈ పరిస్థితి నుంచి బయటపడి మానసికంగా కోలుకుంటున్నానని తెలిపారు.
ప్రస్తుతం తాను రొమాంటిక్ రిలేషన్షిప్ల గురించి పెద్దగా ఆలోచించడం లేదని భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకునే ధైర్యం తనకు లేదని ఇషా స్పష్టం చేశారు. అయినా? ప్రేమపై నమ్మకం పోలేదని, తల్లి .. స్నేహితుల రూపంలో లభిస్తున్న ప్రేమను ఎంతో విలువైనదిగా భావిస్తున్నానని చెప్పారు. గతంలో జరిగిన పరిణామాల వల్ల తాను చేదు అనుభవాలను ఎదుర్కొన్నప్పటికీ ఒక వ్యక్తిగా పూర్తిగా మారిపోనని భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. ప్రస్తుతానికి విడిపోవడమే తన జీవితంలో ఓ బాధాకరమైన అధ్యాయమని.. దీనిని ప్రశాంతంగా ముగించాలనుకుంటున్నానని ఇషారిఖీ తెలిపారు.
















































