విజయ్ లవ్ గురించి రష్మిక ఏమందంటే?
Rashmika About Vijay Deverakonda’s Love
కథానాయిక రష్మిక మందన్న తన కొత్త చిత్ర కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ప్రేమ, బంధాలపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. వేడుకలో భాగంగా వేదికపై రష్మిక మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా విజయ్ దేవరకొండ పేరును గట్టిగా పలకడం ప్రారంభించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆ కేరింతలు, నినాదాల మధ్య రష్మిక ముసిముసి నవ్వులు చిందిస్తూ ఎంతో సమయస్ఫూర్తితో స్పందించారు.
ఈ సందర్భంగా ప్రేమకు సరైన నిర్వచనం ఏమిటని అడగ్గా రష్మిక బదులిస్తూ.. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదని.. అది పరస్పర భాగస్వామ్యం, నిబద్ధత , నమ్మకం` అని పేర్కొన్నారు. ఒకరికొకరు తోడుగా నిలబడటం, కష్టసుఖాల్లో భాగస్వాములు కావడమే నిజమైన ప్రేమ అని వివరించారు. రష్మిక చెప్పిన డెఫినిషన్కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ, రష్మికలకు సంబంధించి సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు విజయ్ పేరును ప్రస్తావించగా రష్మిక స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా విజయ్ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని పలుమార్లు పేర్కొన్న రష్మిక వేదికపై ప్రేమ గురించి చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి.
















































