Advertisement

టాక్సిక్ - ఈ హైప్ సరిపోతుందా?

Toxic: Is This Hype Really Enough?


టాక్సిక్ విడుదలకు జస్ట్ ఐదు రోజులే ఉంది. ఈ నెల 26 న యశ్ టాక్సిక్ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలవుతుంది. మరి పాన్ ఇండియా మర్కెట్ లో టాక్సిక్ హైప్ సరిపోతుందా అనే అనుమానాల్లో ప్రేక్షకులు ఉన్నారు. టాక్సిక్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇక పాన్ ఇండియాలోని ప్రతి భాషలో టాక్సిక్ ని ప్రమోట్ చేస్తున్నా టాక్సిక్ పై ప్రేక్షకుల్లో అనుకున్నంత ఆసక్తి కనిపించడం లేదు అనే టాక్ వినిపిస్తుంది. మరి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక టాక్సిక్ పై క్రేజ్ ఎంత ఉందొ అనేది ఓ క్లారిటీ వస్తుంది. యష్ కెజిఎఫ్ సక్సెస్ ని టాక్సిక్ తో కంటిన్యూ చెయ్యాలి అనేది ఆయన అభిమానుల ఆశ.

మరి కెజిఎఫ్ అంత టాక్సిక్ హిట్ అవుతుందా, హీరోయిన్స్ నయనతార క్రేజ్, కియారా అందాలు, రుక్మిణి వసంత్, హ్యూమ ఖురేషి, తార సుతారియా వీళ్లంతా సినిమాపై క్రేజ్ పెంచే ప్రమోషన్స్ చేస్తున్నారు. అయినప్పటికీ పాన్ ఇండియా మూవీకి ఉండాల్సిన హైప్, క్రేజ్ టాక్సిక్ లో కనిపించడం లేదు.. ఇప్పుడున్న హైప్ ప్రేక్షకులకు సరిపోతుందా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న సస్పెన్స్.
 

Toxic: The Hype Is Huge, But Is It Enough?