Advertisement

అయ్యగారు అఖిల్ ఏం చేస్తున్నారు

What’s Akhil’s Next Move

                  

అయ్యగారు అఖిల్ ఏం చేస్తున్నాడు. లెనిన్ సూపర్ హిట్ తర్వాత అఖిల్ రిలాక్స్ అవుతున్నాడా, లేదంటే కొత్త కథలు వింటున్నాడా అనే సందేహంలో అక్కినేని అభిమానులు ఉన్నారు. లెనిన్ తో రూ.100 కోట్ల క్లబ్బులోకి మొదటిసారి అడుగుపెట్టిన అఖిల్ తదుపరి చిత్రంపై అభిమానుల్లోనే కాదు కామన్ ఆడియన్స్ లోను ఆసక్తి కనిపిస్తుంది.

లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ భార్య జైనాబ్ తో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్ కు వెళ్ళొచ్చాడు. ఆతర్వాత సైలెంట్ అయ్యాడు. ఏజెంట్ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తో వచ్ఛాను, ఈసారి ఎలాంటి గ్యాప్ ఉండదు మీకు మాటిస్తున్నాను అంటూ అభిమానులకు చెప్పిన అఖిల్ ఇంకా తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.

లెనిన్ తో మాస్ హిట్ కొట్టిన అఖిల్ దానికి ఏమాత్రం తగ్గకుండా తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకోవాలి. అందుకే అఖిల్ సమయం తీసుకుని సరైన స్క్రిప్ట్ అలాగే దర్శకుడిని ఎంచుకుని అనౌన్స్ చేస్తామో.. కానీ ఈలోపు అభిమానుల్లో అఖిల్ నెక్స్ట్ పై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

 

Akhil’s Next Move: What’s Brewing