లండన్ క్రికెట్ మైదానంలో హీరో బౌలింగ్ విన్యాసాలు!
Hero's Bowling Stint Creates Buzz in London
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తాజాగా లండన్‌లోని క్రికెట్ మైదానంలో బౌలింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సైఫ్ తనదైన శైలిలో బౌలింగ్ యాక్షన్‌తో బ్రోల్ విసిరుతూ కనిపించారు. ఆయన క్రీడాస్ఫూర్తిని చూసిన ఫ్యాన్స్ సైఫ్ కేవలం వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అని కొనియాడుతున్నారు.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అయిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కుమారుడైన సైఫ్ అలీ ఖాన్ రికార్డుల ప్రకారం క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అందుకే ఆయన బౌలింగ్ వేసే విధానాన్ని చూసిన నెటిజన్లు ఖందానీ క్రికెటర్ హై (వారసత్వంగా వచ్చిన క్రికెట్ లక్షణాలు) అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఆ వంశానికే తగినట్లుగా సైఫ్ బంతులు విసిరిన తీరు క్రీడా ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సినిమా షూటింగ్‌లు లేదా విదేశీ పర్యటనల్లో ఉన్నప్పటికీ క్రీడలపై తనకున్న మక్కువను సైఫ్ ఎప్పుడూ కోల్పోరని ఈ వీడియో మరోసారి నిరూపించింది. నటనతో పాటు ఫిట్‌నెస్ .. క్రీడలపై ఆయన చూపించే శ్రద్ధ యువ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం లండన్ మైదానంలో సైప్ అలీఖాన్ చేసిన బౌలింగ్ విన్యాసాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.







































