బుచ్చిబాబు కు వెయిటింగ్ తప్పదా?
Buchi Babu Has to wait for his next
పెద్ది డైరెక్టర్ బుచ్చి బాబు కి వెయిటింగ్ తప్పదా. ఉప్పెన చిత్రంతో హిట్ కొట్టి తదుపరి చిత్రాన్ని ఏకంగా పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేసిన బుచ్చి బాబు.. పెద్ది తో ఏమాత్రం ఇంప్రెస్స్ చెయ్యలేకపోయాడు. పెద్ది చిత్రం ఫైనల్ రన్ లో రూ.400 కోట్లు పట్టుకొచ్చినా మెగా ఫ్యాన్స్ లో ఎలాంటి ఆనందం లేదు.
కారణం పెద్ది చిత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చెయ్యడంలో తడబడింది. హిందీ, ఓవర్సీస్ అలాగే మిగతా లాంగ్వేజెస్ లో పెద్ది పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రామ్ చాన్ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. బుచ్చి బాబు పెద్ది చిత్రాన్ని హ్యాండిల్ చేయడంలో ఆయనకు అనుభవం సరిపోలేదు.
ఇప్పుడు బుచ్చి బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. అయితే ఈసారి బుచ్చి బాబు కథకు స్టార్ హీరో ఎవరూ పడడం లేదు అని టాక్. బుచ్చి బాబు ఈసారి మీడియం హీరో, లేదంటే చిన్న హీరో తో సరిపెట్టుకుని.. ఈ ప్రాజెక్ట్ తో ప్రూవ్ చేసుకుంటేనే స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ దొరుకుంది అంటున్నారు. మరి బుచ్చి బాబు దారెటు అనేది చూడాలి.







































