ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manchu Lakshmi on her Life experiences

నేలమీద నిలబడి.. నింగిని తాకే ఆలోచనలతో!

Manchu Lakshmi on her Life experiences

 

నటి, ప్రెజెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఇటీవల తన వ్యక్తిగత .. వృత్తిగత జీవిత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నానని, జీవితాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటూ గ్రౌండెడ్‌గా ఉంటున్నానని  వెల్లడించారు. అనుభవాలు నేర్పిన పాఠాలు  మరింత పరిపక్వత వైపు నడిపించాయని పేర్కొన్నారు.

సినిమా రంగంలో సుదీర్ఘ ప్రయాణం చేసిన లక్ష్మి మంచు, ఎన్నో విజయాలు, సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. నటిగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రలు, టాక్ షోలతో ప్రేక్షకులను అలరించిన ల‌క్ష్మి  ప్రతి దశలోనూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో తాను తీసుకుంటున్న నిర్ణయాలు మరింత స్పష్టతతో కూడుకున్నవని... విమర్శలను కూడా సానుకూలంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నానని తెలిపారు.

సమాజంలో మహిళా నటులు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ తనకంటూ  బలమైన స్థానాన్ని ఏర్పరు చుకున్న లక్ష్మీ మంచు మాటలు యువ న‌టీమ‌ణుల‌కు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. భవిష్యత్‌లో మరింత వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని  సంకేతాలు ఇచ్చారు. పరిపక్వతతో కూడిన ల‌క్ష్మి ఆలోచనా విధానంతో  ఇండస్ట్రీ వర్గాల నుంచి  ప్రశంసలు అందుకుంటోంది.
 

Manchu Lakshmi on her Life