నాని-మృణాల్ ఠాకూర్ ఫిక్స్
Nani30 Unveiledన్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ #Nani30 వరల్డ్ ని ఆవిష్కరిస్తూ ఒక వీడియోను విడుదల చేసారు. నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి తన ఆన్-స్క్రీన్ కుమార్తెతో చర్చిస్తున్నట్లు ఈ స్పెషల్ వీడియో చూపిస్తుంది. దసరా చిత్రానికి పెంచిన మీసాలతో పాటు గడ్డం కూడా షేవ్ చేస్తానని అంటున్నాడు నాని. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, తండ్రీకూతుళ్ల బాండింగ్ యూఎస్‌పీగా ఉండబోతోందని ఈ స్పెషల్ వీడియో చూస్తే అర్ధమౌతోంది.
ఈ గ్లింప్స్ దర్శకుడితో సహా చిత్రానికి సంబంధించిన ప్రధాన సాంకేతిక నిపుణులను ప్రకటించారు. నూతన దర్శకుడు శౌర్యువ్ తొలిసారిగా మెగాఫోన్‌ను పట్టుకుని, చిన్న వీడియోతో భావోద్వేగానికి గురిచేశాడు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా పని చేస్తున్నారు. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ తర్వాత నానితో ఇది అతనికి మూడవ చిత్రం. సినిమాటోగ్రాఫర్ ఎమోషన్స్ అద్భుతంగా ఆవిష్కరించాడు.
The World Of Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments Production No 1 (Nani30) Unveiled







































