దిల్ రాజు కి అంతా హడావుడే

Everything is rushing to Dil Raju

దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యాడు. రౌడీ బాయ్స్ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఇంకా మార్నింగ్ షో కూడా అవ్వకుండానే, దిల్ రాజు యూనిట్ హడావిడిగా దిల్ రాజు ప్రెస్ మీట్ అంటూ మెసేజెస్ పంపేశారు. ఇంకా మార్నింగ్ షో సినిమా కాకుండానే దిల్ రాజుకి ఎందుకో ఈ హడావిడి. సినిమాలో దమ్ముంటే ఆ సినిమా ఎలా అయినా ఆడుతుంది. ప్రెస్ మీట్ పెట్టి మా సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది అని చెప్పక్కరలేదు. 

సినిమా విడుదల అయిన ఆరగంటకే ఇప్పుడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్ టాక్, ఓవర్సీస్ టాక్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. కనీసం మార్నింగ్ షో అయినా అవ్వాలి కదా. సినిమా రిలీజ్ అయిన రోజే, సక్సెస్ మీట్ పెట్టెయ్యాలి, అని డిసైడ్ అయిపోతున్నారు అందరు నిర్మాతలు. పెద్ద నిర్మాత అయిన దిల్ రాజు కూడా అదే బాటలో సక్సెస్ మీట్ లాగా పెట్టేసి, ఆశిష్ ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు అని చెప్పేసాడు. దానితో దిల్ రాజు కి తొందర, అంతా హడావిడే అని అందరు అనుకుంటున్నారు. 

Ashish Rowdy Boys success celebrations

ashish
rowdy boys movie
rowdy boys success celebrations
dil raju