Advertisement
Google Ads BL

కావాలనే ‘మాజీ’ని కెలుకుతున్నాడా?


కరణ్ జోహార్.. ఈ పేరు తెలియని బాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. టాలీవుడ్‌లో కూడా చాలా మందికి ఈ పేరు పరిచయమే. ‘లైగర్’ చిత్రంతో నిర్మాతగా టాలీవుడ్‌కి కూడా ఆయన పూర్తి స్థాయిలో పరిచయం కాబోతున్నాడు. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో కరణ్ జోహార్ పేరు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షో‌తో కరణ్ మరింతగా పాపుల్ అవుతున్నాడు. కారణం.. అందులో సెలబ్రిటీలను ఆయన అడిగే ప్రశ్నలే. ముఖ్యంగా ‘శృంగారం’, ‘మాజీ’కి సంబంధించి సెలబ్రిటీలకు ఆయన సంధించే ప్రశ్నలు.. కరణ్‌ని, ఆయన హోస్ట్ చేస్తున్న ఈ షోని టాక్ ఆఫ్ ద షో‌గా నిలబెడుతున్నాయి. ఈ షోలో ఇప్పుడు టాలీవుడ్ నటులు కూడా ఇరుక్కుంటున్నారు.. అనే కంటే బలవుతున్నారంటే బాగుంటుందేమో.

Advertisement
CJ Advs

ఇది కూడా చదవండి: జబర్దస్త్ జోడి: పెళ్ళికి ముందే పూజలా..!

అంతకుముందు క్రికెటర్ హార్థిక్ పాండ్యా విషయంలో ఈ షో కాంట్రీవర్సీకి గురై.. కొన్నాళ్లపాటు ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని కరణ్ ఈ షోని ప్రారంభించారు. అయితే టీవీ నుంచి ఓటీటీకి వచ్చిన ఈ షోలో ఈసారి ‘A’ కంటెంట్‌ని బాగా పెంచారు. ఓటీటీ కావడంతో సెన్సార్ సమస్యలు ఉండవు కాబట్టి.. కరణ్ కావాలని సెలబ్రిటీల పర్సనల్ విషయాలను కెలికేస్తున్నాడు. విజయ్ దేవరకొండపై ‘శృంగార’ అస్త్రాన్ని ప్రయోగించి క్యాష్ చేసుకున్న కరణ్.. అక్షయ్ కుమార్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్న ‘సమంత’తో ‘మాజీ’ వ్యవహారంపై చెడుగుడు ఆడేశాడు. చైతూపై ఆమె ఈ షోలో చేసిన కామెంట్స్.. ఇప్పటికీ టాలీవుడ్‌లో హాట్‌హాట్‌గా వైరల్ అవుతూనే ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: దసరా సెట్స్‌లో నానికి ప్రమాదం

ఇక తాజాగా ఈ షోలో పాల్గొన్న కరీనా కపూర్‌పై కూడా ‘మాజీ’ అస్త్రం ప్రయోగించి.. కరణ్ నాలుక కరుచుకున్నాడు. బాలీవుడ్‌కి చెందిన ఓ హీరోని కరీనాకు మాజీ భర్త అంటూ సంభోధించి.. తర్వాత తన తప్పు తెలుసుకుని.. మాజీ ప్రియుడని కరెక్ట్ చేసుకున్నాడు. దీంతో అవాక్కయిన కరీనా.. సీరియస్ అయ్యే స్థాయికి వెళ్లి.. మళ్లీ తమాయించుకుంది. మొత్తంగా చూస్తే కరణ్.. కావాలనే ఈ ‘మాజీ’ వ్యవహారాన్ని కెలుకుతున్నాడనేది.. ఆయన షో నిర్వహించే తీరును చూస్తుంటే తెలుస్తుంది. ఇది కొందరికి ఆసక్తిని కలిగించినా.. మరికొందరికీ మాత్రం.. ముఖ్యంగా ఈ షోకి వచ్చే సెలబ్రిటీలకు ఇబ్బందికరంగా మారుతుందన్నది మాత్రం వాస్తవం.

Karan Johar Creates Sensation with EX strategy:

Karan Johar Questions in Koffee with Karan Creates sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs