అంటే సుందరానికి సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నాని మాస్ యాంగిల్ లో కనిపిస్తున్న దసరా మూవీ నుండి నేడు ఫ్రెండ్ షిప్ డే పోస్టర్ వదిలారు. సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికులు కాదు సింగరేణి బ్యాచ్ మధ్యలో కూర్చుని నాని ఇచ్చిన మాస్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఆ పోస్టర్ ని తనివితీరా చూసుకునేలోపే నానికి దసరా సెట్స్ లో ప్రమాదం జరిగింది అని తెలియడంతో.. ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అయితే సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ సమయంలో అక్కడే ఉన్న నానిపై ఓ టిప్పర్‌లో ఉన్న బొగ్గు లోడ్ పడిందని తెలుస్తోంది. దానితో షాకయిన సిబ్బంది నానిని సేఫ్ గా బయటకు తీశారని సమాచారం. షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదంలో నానికి స్వల్ప గాయాలే అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ లో సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ యాక్షన్ సన్నివేశాల్లో భాగంగానే నాని ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. చిన్న చిన్న దెబ్బలే తగలడంతో నాని మళ్ళీ వెంటనేనే షూటింగ్ లో పాల్గొన్నాడని సమాచారం. దానితో నాని ఫాన్స్ రిలాక్స్ అవుతున్నారు.