జబర్దస్త్ కి టీఆర్పీ తెచ్చే ప్రాసెస్ లో మల్లెమాల యాజమాన్యం, జబర్దస్త్ డైరెక్టర్స్ కలిసి యాంకర్ రష్మీ కి, కమెడియన్ సుధీర్ కి మధ్యన లవ్ ట్రాక్ నడిపించారు. సుధీర్ - రష్మీ సోలో గా కన్నా ఇలా లవ్ ట్రాక్ తోనే బాగా ఫెమస్ అయ్యారు. రష్మీ - సుధీర్ మధ్యలో ఏం లేకపోయినా. ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేసారు. ఆ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. తర్వాత అదే రీతిలో ఇమ్మాన్యువల్ - వర్ష ట్రాక్ లేపినా అది వర్కౌట్ అవ్వలేదు. ఇంతలో రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత మధ్యన ప్రేమ ఉంది.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ మొదలయ్యింది.
సుజాత-రాకేష్ ఒకే టీం లో కామెడీ చేస్తూ కలిసిపోయారని, వాళ్ళ మధ్యలో పక్కా ప్రేమ ఉంది, అందుకే గిఫ్ట్ లు ఇచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతన్న వేళ.. సుజాత పెళ్లి కాకుండానే రాకేష్ ఇంట్లో శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చెయ్యడం ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానాలకు బలం చేకూర్చేలా చేసింది. సుజాత రాకేష్ ఇంట్లో పూజ చేసిన తర్వాత వరలక్ష్మి వ్రతం చేశానోచ్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. మరి భర్తల కోసం భర్యాలు చేసే ఈ పూజ ని సుజాత కాబోయే అత్తగారింట్లో.. అత్తగారితో కలిసి నిర్వహించడమే కాదు, పూజ కి కావాల్సిన ప్రసాదాల నుండి, అమ్మవారికి చీర కట్టే వరకు అన్ని తానే చేశాను అని, అలాగే పూజకి వచ్చిన వారికి వాయినం కూడా ఇచ్చినట్లుగా చెప్పుకుంటూ సుజాత మురిసిపోయింది. దానితో పెళ్ళికి ముందే కాబోయే భర్త ఇంట్లో పూజలా అంటూ వాపోతున్నారు నెటిజెన్స్.