Advertisementt

Live Upadates: CBN-PK ప్రమాణ స్వీకారం

Fri 28th Jun 2024 10:16 PM
ap politics  Live Upadates: CBN-PK ప్రమాణ స్వీకారం
CBN Oathing ceremony 2024 Live Upadates: CBN-PK ప్రమాణ స్వీకారం
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి.. మరికాసేపట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. అని ఎప్పుడెప్పుడు ప్రమాణం చేస్తారా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షలాది మంది తరలిరాగా.. టీవీలు, యూట్యూబ్‌లు, సోషల్ మీడియాకు కోట్లాది జనం అతుక్కుపోయారు. సరిగ్గా ఉదయం 11:27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరపల్లిలోని సభా ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు.

బాబుతో పాటుగా 24 మంది మంత్రులు కూడా ఇవాళే ప్రమాణం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్, 100% స్ట్రైక్ రేట్ కొట్టి రియల్ పవర్ స్టార్ అనిపించుకున్న కొణిదెల పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ మహోత్తర వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖా మంత్రి అమిత్ షా.. తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు.. ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దలు విచ్చేశారు.

Chandrababu naidu ministry (TDP Ministers)

PawanKalyan Oathing (JanaSena Ministers)

🌟 భారీ కాన్వాయ్ తో సభకు బయలుదేరిన చంద్రబాబు

🌟 Megastar Family members started in special buses for Pawan Kalyan swearing in ceremony

🌟 Nandamuri Balakrishna arrives at Swearing in ceremony

🌟 Nara Lokesh arrives at the venue of swearing-in ceremony

🌟 దారులన్నీ గన్నవరం మండలం కేసరిపల్లె వైపే..!

ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ వాహనాలు

ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు.. భారీగా ట్రాఫిక్ జామ్

పలు వాహనాలను వెనక్కి పంపుతున్న పోలీసులు

దయచేసి వెనక్కి వెళ్లాలని జనాలకు పోలీసుల విజ్ఞప్తి

ఏలూరు జిల్లాలో నేషనల్ హైవే 16పై నిలిచిన భారీ వాహనాలు

కలపరు, పొట్టిపాడు టోల్‌గేట్ల వద్ద వాహనాలు వెనుదిరగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి

🌟 Chiranjeevi arrives at swearing-in ceremony. Greeted and welcomed by Nandamuri Balakrishna

🌟 Rajinikanth arrives at swearing-in ceremony. Welcomed by Nandamuri Balakrishna. 

🌟 Rajinikanth and Chiranjeevi seated on stage

🌟 Actor-politician Nandamuri Balakrishna meets Union Ministers Chirag Paswan and Kinjarapu Ram Mohan Naidu at Gannavaram Mandal, Kesarapalli IT Park where the swearing-in ceremony of TDP chief and Andhra Pradesh CM-designate N Chandrababu Naidu.

🌟 NCP leader Praful Patel arrives in Vijayawada to attend the swearing-in ceremony of TDP chief & Andhra Pradesh CM-designate N Chandrababu Naidu.

He says, "Chandrababu Naidu is a very dynamic leader, a visionary who transformed erstwhile Andhra Pradesh. I am sure there will be a new era of development in the state under his leadership now. Pawan Kalyan has changed the way people think abut politicians. I am sure this team of Chandrababu Naidu and Pawan Kalyan will do good work and transform Andhra Pradesh.

🌟 Pawan Kalyan wife Anna Lezhneva arrives at swearing-in ceremony

🌟 TDP National General Secretary Nara Lokesh left his home in Undavalli for the Assembly venue. Soon, Chandrababu will take oath as Chief Minister and Lokesh as Minister.

🌟 Amit Shah and JP Nadda have arrived at the venue of Chandrababu Naidu’s swearing-in ceremony. G Kishan Reddy can also be seen walking towards the stage.

🌟 ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు!

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రముఖులు

కేసరపల్లిలో అట్టహాసంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం

కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎన్వీ రమణ

కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ జేపీ నడ్డా.. సినీ రాజకీయ ప్రముఖులు

కాసేపట్లో కేసరపల్లికి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు

🌟 ప్రత్యేక ఆకర్షణగా మెగా- నందమూరి ఫ్యామిలీస్!

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా మెగా- నందమూరి కుటుంబ సభ్యులు

చిరంజీవి, బాలకృష్ణలు వేదికపైకి వచ్చి అందరినీ పలకరించిన వైనం

బాలయ్య, చిరు అభివాదంతో జై బాలయ్య.. జై చిరంజీవ అంటూ మార్మోగిన సభాప్రాంగణం

విజయవాడ నుంచి కేసరపల్లికి బస్సులో వచ్చిన మెగా ఫ్యామిలీ

🌟 ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ప్రమాణ స్వీకారోత్సవంలో కలిసిన అమిత్ షా.. వెంకయ్య నాయుడు

చూడముచ్చటగా ఉందంటున్న అభిమానులు, సభికులు

ఒకరికొకరు చెవిలో గుసగుసలాడుకున్న పెద్దలు

చంద్రబాబు గురించి సరికొత్తగా షాకు చెప్పిన వెంకయ్య..?

అవును.. అంతా తెలుసు అన్నట్లుగా తల ఊపిన అమిత్ షా

ఇద్దరు ఏం మాట్లాడుకున్నారబ్బా అని తథేకంగా చూడసాగిన సభికులు

మాట్లాడుతుండగానే మధ్యలో వచ్చిన తమిళిసై.. నమస్కరించిన పెద్దలు

కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కలిసిమెలసి ఉన్న షా, వెంకయ్య

ఉపరాష్ట్రపతిగా పదవి కాలం ముగిశాక రాజకీయాలకు దూరంగా వెంకయ్య

చాలా రోజుల తర్వాత రాజకీయ వేదికలపై వెంకయ్య దర్శనం!

🌟 మామయ్యకు పాదాభివందనం!

నందమూరి బాలయ్యకు పాదాభివందనం చేసిన అల్లుడు

సభావేదికపైకి వస్తూ బాలకృష్ణకు నారా లోకేష్ పాదాభివందనం

ఆశీర్వదించి.. ముందుకు పంపిన బాలకృష్ణ

కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

మంత్రిగా ప్రమాణం చేయనున్న నారా లోకేష్

కార్యక్రమానికి విచ్చేసిన నారా, నందమూరి.. మెగా ఫ్యామిలీ

🌟 Ram Charan arrives at swearing-in-ceremony

🌟 PM Narendra Modi will reportedly land at Gannavaram airport shortly. Once the PM lands, he will be heading over to the venue of Naidu’s swearing-in ceremony. This is the fourth time that Naidu will take the oath as Andhra CM

🌟 ఒకే వాహనంలో బయల్దేరారు!

కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

కేసరపల్లికి బయల్దేరిన ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు

🌟 Former Telangana Governor has also arrived at Vijaywada to attend the swearing-in ceremony of TDP chief & Andhra Pradesh CM-designate N Chandrababu Naidu.

🌟 Reports suggest Pawan Kalyan got stuck in traffic

🌟 CBN First signatures on DSC and pension hike files tomorrow

🌟 Approval of the cancellation of the Land Titling Act!

🌟 భువనేశ్వరి చిరునవ్వు!

ప్రమాణ స్వీకారోత్సవ సభలో నారా భువనేవ్వరి చిరునవ్వు

చాలా రోజుల తర్వాత నవ్విన నారా వారి కోడలు

అవమానించిన వైసీపీకి.. ఇదొక చెంప పెట్టు అంటున్న టీడీపీ

సభావేదికపైనే ఉన్న అక్క పురంధేశ్వరి

అక్కలిద్దర్నీ పలకరించిన నందమూరి బాలయ్య

అక్క తలనిమిరిన తమ్ముడు.. నవ్వుకున్న భువనేశ్వరి

🌟 వేదికపైకి వచ్చేశారు..!

ప్రమాణ స్వీకారోత్సవ సభావేదికపైకి విచ్చేసిన అతిరథులు

ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. గవర్నర్

మరికొన్ని నిమిషాల్లో ప్రమాణ స్వీకారోత్సవం

జాతీయగీతం ప్రారంభం.. కాసేపట్లో ప్రమాణం

🌟 నారా చంద్రబాబు నాయుడు అనే నేను..... దద్దరిల్లిన సభా ప్రాంగణం 

🌟 నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు

గవర్నర్ సమక్షంలో చంద్రబాబు ప్రమాణం

నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు

దైవ సాక్షిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు

సభలో ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం

సీఎంగా చూడాలని ఎన్నోరోజులుగా వేచి చూసిన తెలుగు ప్రజలు

🌟 LED screens have been installed in 29 places in East Godavari district to watch the swearing-in ceremony of Chandrababu Naidu as Chief Minister.

People watching the swearing-in ceremony

A festive atmosphere prevailed in the district

🌟 పవన్ కల్యాణ్ అనే నేను..!

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను అంటూ పవర్ స్టార్ ప్రమాణం

తెలుగులో మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం

ఒక్కసారిగా ఈలలు, కేకలు.. నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం

పసుపు, ఎరుపు, కాషాయ జెండాలతో రచ్చ రచ్చ చేసిన అభిమానులు

డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని చర్చ.. ఇంకా ఖరారు కాని శాఖలు

🌟 తమ్ముడు ప్రమాణం.. అన్నయ్య  చిరు నవ్వు!

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ఆనందంలో మునిగి తేలిన మెగా ఫ్యామిలీ

తమ్ముడి ప్రమాణం చూసి మెగాస్టార్ చిరంజీవి చిరు నవ్వు

ఒకింత ఎమోషనల్ అయిన చిరంజీవి

చప్పట్లు కొట్టిన అన్నా లెజినోవా.. మెగా కుటుంబ సభ్యులు

🌟 దైవ సాక్షిగా లోకేష్ ప్రమాణం

నారా లోకేష్ అనే నేను అంటూ మంత్రిగా ప్రమాణం

మంత్రిగా ప్రమాణం చేసి గవర్నర్ దగ్గర సంతకం

చంద్రబాబు, గవర్నర్‌కు పాదాభివందనం చేసిన లోకేష్

చప్పట్లు కొట్టిన నారా బ్రహ్మాణి, నారా భువనేశ్వరి

🌟 మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణస్వీకారం

🌟 స్పెషల్ అట్రాక్షన్‌గా చరణ్ - బ్రాహ్మణి

సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నారా బ్రాహ్మణి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఓ వైపు ప్రమాణ స్వీకారం.. మరోవైపు ఇద్దరి ముచ్చట్లు

సభావేదిక ముందు ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్న వీఐపీలు

మధ్యలో హడావుడి చేస్తున్న నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్

🌟 మంత్రిగా కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం 

🌟 ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు

చంద్రబాబు కేబినెట్‌లో ఇదివరకే మంత్రిగా పనిచేసిన అచ్చెన్న, రవీంద్ర

గత కేబినెట్‌లో కార్మిక శాఖా మంత్రిగా అచ్చెన్న బాధ్యతలు

ఈసారి ఏ శాఖ కేటాయిస్తారో అని సర్వత్రా ఆసక్తి

🌟 మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం

🌟 ప్రమాణం.. ఆలింగనం!

జనసేన సీనియర్ నేతగా.. పవన్ తర్వాత నంబర్‌గా పనిచేసిన వైనం

ప్రమాణ స్వీకారం చేశాక పవన్‌ను ఆలింగనం చేసుకున్న నాదెండ్ల

🌟 ఇక కేబినెట్ లోని ఇతర మంత్రులందరి ప్రమాణ స్వీకారం జరుగుతోంది.

ఎవరికీ ఏ శాఖ అనేదే అందరికీ ఆసక్తికరంగా మారింది

🌟 తొలిసారి గెలుపు.. వరించిన అదృష్టం

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా సత్యకుమార్ ప్రమాణం

ధర్మవరం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి గెలిచిన సత్య

కంచుకోటగా ఫీలయిన కేతిరెడ్డిని ఓడించి మంత్రిగా ప్రమాణం

బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కిన వైనం

ఎమ్మెల్యే, మంత్రిగా సరే.. ఏ శాఖ ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి

🌟 For the first time since 1994, Chittoor district has no representation in the state cabinet except the Chief Minister.

🌟 పవన్ ప్రమాణం.. భావోద్వేగం!

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కట్టి అఖండ విజయం

కూటమిలో కొణిదెల వారబ్బాయి కీలక పాత్ర

గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి అన్నీ తానై చూసుకున్న పవన్ కల్యాణ్

ఇన్నాళ్లు పవర్ లేని స్టార్‌గా వ్యంగ్యాస్త్రాలు

పదంటే పదేళ్లలో సీన్ మొత్తం రివర్స్

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని

పవన్ ప్రమాణంతో జనసైనికుల్లో భావోద్వేగం

ఎన్నాళ్లో వేచిన హృదయం అంటూ ఆనంద భాష్పాలు!

కోట్లాది అభిమానులు, కార్యకర్తలు తిలకించిన ప్రమాణ స్వీకారం

సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్న వైనం

🌟 మోదీకి సన్మానం..!

ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కల్యాణ్

వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించిన చంద్రసేన!

పవన్.. పవన్ అంటూ ఈలలు, కేకలు.. ఒక్కటే నినాదాలు

పవన్ క్రేజ్ చూసి ఏంటిది అని నవ్వుకున్న నరేంద్ర మోదీ

మోదీ రియాక్షన్‌తో నవ్వేసున్న పవన్ కల్యాణ్

🌟 స్టార్లతో ప్రధాని మోదీ!

అటు మెగాస్టార్.. ఇటు పవర్ స్టార్‌తో ప్రధాని మోదీ

ప్రత్యేకంగా చిరంజీవితో చేయి కలిపిన మోదీ

పవన్ కల్యాణ్‌ చేయిపట్టుకునే చిరు దగ్గరికి ప్రధాని

ఇద్దరి చేతులు పైకి లేపి మోదీ అభివాదం

పొలిటికల్, సినిమా స్టార్లు అంటూ నినాదాలు చేసిన అభిమానులు

ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ నిలిచిన బ్రదర్స్ సీన్

🌟 తలైవా, బాలయ్యతో ప్రధాని పలకరింపు

ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన పెద్దలను పలకరించిన ప్రధాని

తలైవా రజనీకాంత్ దంపతులకు నరేంద్ర మోదీ కరచాలనం

నందమూరి బాలకృష్ణతో ప్రత్యేకంగా చేయి కలిపిన మోదీ

వీడ్కోలు పలికిన సీఎం చంద్రబాబు.. కొత్త మంత్రులు

🌟 జాతీయ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవం ముగింపు

జాతీయగీతం జనగణమనతో ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం, ముగింపు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం

మంత్రులుగా పవన్ కల్యాణ్‌తో పాటు 24 మంది ప్రమాణం

కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు

పెద్ద ఎత్తున తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు, వీఐపీలు

ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి వర్గ సభ్యులతో కలిసి ఫొటోలు

ప్రధాని మోదీ, గవర్నర్‌తో కలిసి మంత్రివర్గం ఫొటోలు దిగిన మంత్రులు

అభివాదం చేసి సభావేదిక నుంచి ప్రధాని మోదీ తిరుగుపయనం

 

CBN Oathing ceremony 2024:

CBN Oathing ceremony 2024

Tags:   AP POLITICS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ