కత్తి పట్టిన సీతమ్మ (సాయి పల్లవి)
Seetamma (Sai Pallavi) wielding a swordసీత అంటే ఏడుపు కాదు, పోరాటం..! కత్తి పట్టిన సీతమ్మ, సాయి పల్లవి చూపించిన కొత్త సీత.
మనం ఇప్పటివరకు సీతమ్మను ఎలా చూసాం.. తల వంచుకుని, కళ్ళల్లో నీళ్ళతో, "రామా.. రామా.." అని దుక్కించే.. భార్య గా కానీ నితీష్ తివారీ తీసిన రామాయణం: పార్ట్ 1 లో సాయి పల్లవి చేసిన సీతను చూసాక నాకు ఒక్కటే అనిపించింది...
అరే.. ఇది కదా అసలు సీతమ్మ కథ అని..
ఇప్పటివరకు తెలుగు చిత్రాలలో మహా మహా నటిమానులు..
సీత పాత్రలు ధరించి మనల్ని మెప్పించారు..
వారి లో ముందుగా.. అంజలీదేవి - లవకుశ (1963)
మన తెలుగు వాళ్ళకు సీత అంటే ముందు గుర్తొచ్చేది అంజలీదేవి గారే..
తరువాత.. గీతాంజలి - సీతారామ కళ్యాణం (1961)..
ఎన్టీఆర్ రావణుడిగా, హరనాథ్ రాముడిగా నటించిన ఈ సినిమాలో గీతాంజలి చేశారు.. గీతాంజలి గారి సీతలో ఒక పసితనం, ఒక అమాయకత్వం ఉండేది.ఆ క్రమంలో.. చంద్రకళ - సంపూర్ణ రామాయణం (1971/72)
ఈ సినిమాలో సీత గా చంద్రకళ, శోభన్ బాబు రాముడిగా నటించారు.
జయప్రద - సీతా కళ్యాణం (1976) & సీతారామ వనవాసం (1977)
జయప్రద గారు ఒక్కసారి కాదు, మూడు సార్లు సీత పాత్ర వేసారు. బాపు గారి సీతా కళ్యాణంలో లక్ష్మిగా, సీతగా డబుల్ రోల్. మళ్ళీ సీతారామ వనవాసంలో సీత. ఆ తర్వాత హిందీ లవకుశలో కూడా సీత గా చేశారు..
సంగీత - శ్రీరామ పట్టాభిషేకం (1978)
ఎన్టీఆర్ గారే తీసిన ఈ సినిమాలో సంగీత సీత.
అర్చన - శ్రీరామదాసు (2006)
నాగార్జున రామదాసుగా నటించిన ఈ సినిమాలో అర్చన సీతరాముడు గా సుమన్ చేశారు..
నయనతార - శ్రీరామరాజ్యం (2011)
బాపు గారి శ్రీరామరాజ్యంలో బాలకృష్ణ రాముడి పక్కన నయనతార సీత. ఈ తరం వాళ్ళకు సీత అంటే నయనతారే.
వీళ్ళందరూ గొప్పగా సీతమ్మ పాత్ర చేసారు.. కానీ వీళ్ళందరి సీతలో ఒకటే కామన్ పాయింట్.. ఎక్కువుగా దుక్కించడం..
అంజలీదేవి అయినా, గీతాంజలి అయినా, చంద్రకళ అయినా, జయప్రద అయినా, నయనతార అయినా.. సీత బాధపడటం, ఏడవడం, భరించడం మాత్రమే చూపించారు.
కానీ ఎవ్వరూ సీత చేతిలో కత్తి పట్టినట్లు చూపెట్టలేదు..
రాక్షసులు సీతమ్మ.. ను భయపెట్టడానికి వచ్చినప్పుడు, సీత భయపడి మూలకు వెళ్ళలేదు. రెండు చేతులు తో రెండు కత్తులు పట్టుకొని అక్కడ నిలబడింది.. యుద్ధం చేసింది.. అదే ఈ రామాయణం లో ప్రత్యేకత.. సంతరించుకొంది.
సీత కత్తి పట్టడం ఏంటి? ఇది కల్పన కాదా?" అని కొంతమంది అనొచ్చు.. కానీ ఇదే అసలు సీతమ్మ..
ఆమె జనక మహారాజు కూతురు. చిన్నప్పటి నుంచి శివ ధనుస్సును ఎత్తి ఆడుకున్న పిల్ల. ధనుస్సు ఎత్తగలిగిన అమ్మాయికి కత్తి పట్టడం పెద్ద విషయమా?
సాయి పల్లవి ఆ ధైర్యాన్ని కత్తి పట్టి.. అపర కాళిగా.. అభినయించి.. శబాష్ అనిపించుకోందేనే చెప్పాలి..
సాయి పల్లవి కత్తి పట్టినప్పుడు అది సినిమా అనిపించదు నిజంగా అమ్మవారు కత్తి పట్టినట్టు అనిపిస్తుంది...
ఆమె అరవదు, కేకలు వేయదు. కేవలం కళ్ళతోనే పోరాడుతుంది..
అంజలీదేవి సీతను మనం దేవతగా చూసాం. గీతాంజలి సీతను మనం అమాయకంగా చూసాం. చంద్రకళ సీతను మనం సహజంగా చూసాం. జయప్రద సీతను మనం లక్ష్మిగా చూసాం. నయనతార సీతను మనం తల్లిగా చూసాం...
కానీ సాయి పల్లవి సీతను మనం కత్తి పట్టిన యోధురాలిగా చూసాం..
సీత అంటే ఏడుపు కాదు, సీత అంటే పోరాటం. సీత అంటే కత్తి పట్టిన ధైర్యం..
ఈ రామాయణం చిత్రం లో సీత గా సాయిపల్లవి సరిగా సెట్ అవ్వలేదు అని కొంతమంది.. చెబుతున్నారు. కానీ మనకు మాత్రం ఆమె 100% తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పాలి. కత్తి పట్టిన సీతమ్మను చూడటం ప్రేక్షకులు కు కచ్చితంగా కొత్త అనుభూతి ని ఇస్తుంది. ప్రేక్షకులు కూడా మెచ్చుకోవటం విశేషం.
















































