తెలుగు సినిమాకి ఇది స్వర్ణయుగం!

CineJosh news

ఓ వైపు హాలీవుడ్‌ ` బాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో ‘‘బాహుబలి, రాణీ రుద్రమదేవి’’- మరోవైపు ‘రన్‌ రాజా రన్‌, మిధునం, ఓనమాలు’ ఇంకోవైపు ‘రేసు గుర్రం, టెంపర్‌, గబ్బర్‌ సింగ్‌, అత్తారింటికి దారేది, కార్తికేయ’ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ : దాసరి నారాయణరావు ఈసారి తన 152వ చిత్రంగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమా-

పవన్‌ కళ్యాణ్‌ సొంత నిర్మాణ సంస్థ తొలి చిత్రం హీరో రామ్‌చరణ్‌- 

హీరో నితిన్‌ సొంత నిర్మాణ సంస్థ అఖిల్‌ని హీరోగా పరిచయం చేయడం-

కెఎస్‌ ప్రకాశరావు - ఒకనాటి తెలుగు సినిమా దిగ్గజం- ఆయన పేరు పెట్టుకున్న ఆయన మనవడు  దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు - కోవెలమూడి ప్రకాష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం ఆరంభం :  ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించడం- క్రిష్‌ సంభాషణలు రాయడం.

తెలుగు సినిమాలో మున్నెన్నడూలేని వైవిధ్యం- అంతకుమించిన సామరస్యం - స్నేహభావం -వ్యాపార దృక్పధం ముచ్చటగొలుపుతోంది. నా వయసింకా పదహారేళ్ళే అన్నట్టు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ నటనకు, సినీ పరిశ్రమకు సేవచేయాలన్న దృక్పధంతో పునరంకితం కావడం- నటి దర్శకురాలు జీవిత నేషనల్‌ ఫిలిమ్‌ సెన్సారు సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించడం- రాజశేఖర్‌ ‘గడ్డం గ్యాంగ్‌’ తో చాలాకాలం తర్వాత మళ్ళీ తెరపై కనిపించడం ఆనందంగా వుంది.

నిన్న మొన్నటివరకు ఆంధ్రా - తెలంగాణ, రాష్ట్ర విభజన సినిమా పరిశ్రమ సంస్ధాగతంగా కూడా రెండుగా చీలే ప్రమాదం పొంచివుంది. కెసిఆర్‌ పెద్ద మనసుతో రామానాయుడి అంతిమక్రియల్లో స్టేట్‌ ఆనర్‌ ఇచ్చారు. ప్రస్తుతం సినీ వాతావరణం ఆహ్లాదకరంగా వుంది- స్వర్ణయుగంలో వున్నట్టుంది.

- తోటకూర రఘు

telugu cinema
swarna yugam
nithin
pawan kalyan
ram charan
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026