వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కు చిల్లు

YSRCP vote bank decreased?YSRCP vote bank decreased?


2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్సార్‌సీపీ అప్పుడు.. మాకు 40శాతం ఓటు బ్యాంక్ స్ట్రాంగ్ ఉంది.. మేము టెక్నీకల్ గా ఓడిపోలేదు అంటూ రచ్చ చేసారు. మళ్లీ మా ఓటు బ్యంకు పెరుగుతుంది అన్నారు. కానీ మాజీ సీఎం జగన్ చేసే పనులు ఎలా ఉన్నాయంటే.. ప్రజలను పట్టించుకోకుండా బెంగుళూరు ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటూ నేతలను, కార్యకర్తలను విస్మరించుకుంటూ కూర్చోవడంతో పార్టీ కి ఎంత ఎఫెక్ట్ అయ్యిందో అనేది ఇప్పుడు మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పతనం చూస్తే తెలుస్తుంది. ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పిటీసి ఎన్నికల్లో కూటమి హవా ముందు వైఎస్సార్‌సీపీ మట్టిలో కలిసిపోయింది.

నిన్న గురువారం జరిగిన పంచాయితీ ఎలక్షన్ లో 
1. గ్రామాల్లోనూ తగ్గిన వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు.. 39% నుంచి 24.6%కి పతనం!
2. ఒకప్పుడు 39%.. ఇప్పుడు 24.6%.. వైఎస్సార్‌సీపీ ఓటు శాతంలో భారీ తగ్గుదల!
3. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ.. భారీగా తగ్గిన ఓటు శాతం!
4. ⁠నాయకత్వ వ్యవహారశైలితో గ్రామస్థాయిలో నిర్వీర్యంగా మారిన వైఎస్సార్‌సీపీ.. కేడర్‌లో తగ్గుతున్న ఉత్సాహం!
ఫేజ్–1 పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురైన పరాజయం.. గ్రామస్థాయిలో పార్టీ బలహీనపడుతున్న తీరుకు అద్దం పడుతోంది.

ఒకప్పుడు 39 నుంచి 40 శాతం ఓటు బ్యాంకుతో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీ.. ప్రస్తుతం 24.6 శాతానికి పడిపోయిందన్న పరిణామం పార్టీకి ఎదురవుతున్న రాజకీయ సవాలును సూచిస్తోంది.
నాయకత్వ నిర్ణయాలు, వ్యవహారశైలితో గ్రామస్థాయిలో నిర్వీర్యంగా మారిన వైఎస్సార్‌సీపీ.. క్రమంగా బలహీనపడుతున్న కేడర్, పార్టీ శ్రేణుల్లో తగ్గుతున్న ఉత్సాహం.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా కూటమికి పట్టం కట్టింది. ప్రస్తుత  ఫలితాలతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయి పట్టు ఏ మేరకు తగ్గిందన్నది చర్చనీయాంశంగా మారింది.

వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ నాయకత్వంపై ప్రజల్లో, కార్యకర్తల్లో నమ్మకం తగ్గుతోందా? కేడర్‌లో నిరుత్సాహం పెరుగుతోందా? పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీ రాజకీయ భవిష్యత్తుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

 

YSRCP Panchayat elections
Bhogi Review
Bhogi Review
27 Nov 2026
O.M Review
O.M Review
27 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
27 Nov 2026
DNK Review
DNK Review
27 Nov 2026
GOAT Review
GOAT Review
27 Nov 2026
Scene Review
Scene Review
27 Nov 2026