చిరు పెద్దరికానికి పెద్ద పరీక్ష

Kaaka vs VishwambharaKaaka vs Vishwambhara

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా దాసరి తర్వాత అందరూ మెగాస్టార్ చిరంజీవి ఇంటికే క్యూ కడుతున్నారు. చిరు కూడా నేను పెద్దరికం ఫీల్ అవడం లేదు అంటూనే ఆయనకు చేతనైనంత సాయం చేస్తుంటారు. చిన్న సినిమా వాళ్ళు తమ సినిమాని ప్రమోట్ చెయ్యమన్నా చిరు వస్తారు, లేదంటే తన ఇంటికే పిలిపించుకుని సినిమాలను ప్రమోట్ చేస్తారు. అలాగే మంచి సినిమాలను పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తుంటారు.

ఆయన పెద్ద కాదు అనుకున్నా చిరు ఇండస్ట్రీకి పెద్దే. మరి ఇప్పుడు చిరు పెద్దరికానికే పెద్ద పరీక్ష ఎదురైంది. అదే ఆయన నటించిన రెండు సినిమాల ఒకేసారి విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. దాని కోసం చిరు చొరవ తీసుకునిని ఎవరో ఒకరిని ఆ సంక్రాంతి డేట్ నుంచి తప్పించేలా ఒప్పించాలి.

చిరు నటిస్తున్న కాక అలాగే విశ్వంభర చిత్రాలు రెండూ సంక్రాంతి డేట్ పైనే కూర్చున్నాయి. కాకా కు ఎప్పుడో డేట్ లాక్ చేసినా.. విశ్వంభర సడన్ ఎంట్రీ కాక మేకర్స్ ని కలవరపెడుతుంది. దర్శకుడు వసిష్ఠ, ఇంకా నిర్మాతలు విశ్వంభర ను ఎలాగైనా సంక్రాంతికే తేవాలని మొండిగా ఉన్నారు. కాక దర్శకుడు బాబీ కూడా సంక్రాంతి డేట్ నుంచి తగ్గడం లేదు.

ఈ రెండు సినిమాల విడుదల విషయంలో చిరు పెద్దరికం తీసుకుని ఎవరినో ఒకరిని ఒప్పించి సంక్రాంతి స్లాట్ నుంచి తప్పించాలి. మరి రెండు సినిమాల్లో చిరు నే హీరో. ఇప్పుడు ఆ సినిమాల విడుదల విషయంలో కన్ఫ్యూజన్ ని చిరు క్లియర్ చెయ్యాల్సిందే. 

Vishwambhara vs Kaaka
Bhogi Review
Bhogi Review
27 Nov 2026
O.M Review
O.M Review
27 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
27 Nov 2026
DNK Review
DNK Review
27 Nov 2026
GOAT Review
GOAT Review
27 Nov 2026
Scene Review
Scene Review
27 Nov 2026